Maharashtra politics crisis : బాల్‌ ఠాక్రే బాటలో షిండే..శివసేన పరిస్థితి ఏంటి..?!

బాల్‌ ఠాక్రే బాటలోశివసేన నేత ఏక్ నాథ్ షిండే పయనిస్తున్నారా? షిండే తిరుగుబాటుతో శివసేన పరిస్థితి ఏంటి..?

Maharashtra politics crisis : బాల్‌ ఠాక్రే బాటలో షిండే..శివసేన పరిస్థితి ఏంటి..?!

Maharashtra Politics Crisis

maharashtra politics crisis : మహారాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి రోజుకో వ్యవహారం.. గంటకో మలుపు.. మహారాష్ట్ర రాజకీయంలో ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది. ముంబై వచ్చి షిండే ఏం చేస్తారన్న సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు బాల్ ఠాక్రే వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. ఎలా ఉన్న పార్టీ ఎలా అయిందన్న చర్చ మొదలైంది. ఇంతకీ మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే ఎలాంటి ముద్ర వేశారు.. కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ అని సాగుతున్న పాలిటిక్స్‌ను ఎలా మలుపు తిప్పారు.. శివసేనను ఎలా నిలబెట్టారు..

మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయ్. షిండే తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో.. మహా వికాస్‌ అఘాడీ సర్కార్ పతనం అంచుకు చేరిపోయింది. సర్కార్ కూలిపోవడం ఖాయం.. పరిస్థితులను చూస్తే అర్థం అవుతోంది కూడా ! ఐతే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. శివసేన పరిస్థితి ఏంటా అని ! షిండే ఆరోపణలు పార్టీ అస్థిత్వాన్నే దెబ్బతీసేలా కనిపిస్తున్నాయ్. అధికారం కోసం కాదు.. హిందుత్వం కోసమే తిరుగుబాటు అంటున్న షిండే.. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను బతికించేందుకు అడుగు ముందుకు వేశామని చెప్తున్నారు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు నిజమైన వారసులం తామే అని షిండే అండ్‌ కో అంటుంటే.. ఠాక్రేకు అసలు వారసులం తామే అంటున్నారు ఉద్ధవ్ అండ్ ఫ్యామిలీ. దీంతో మహారాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు బాల్ ఠాక్రే చుట్టూ తిరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శివసేన పయనం ఎలా సాగుతుంది.. చివరికి మిగిలేది ఏంటి అన్న చర్చ దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Also read : Maharashtra political crisis: వీడని ఉత్కంఠ.. దూకుడు పెంచిన బీజేపీ.. అడ్డుకొనేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు

సీఎం అధికారిక భవనాన్ని ఖాళీ చేసిన ఉద్ధవ్‌.. తర్వాత ఏం జరగబోతోందో.. ఏం చేయబోతున్నారో పరోక్షంగా సంకేతాలు పంపారు. విషయం ఏదైనా.. వివాదం ఎలాంటిదైనా.. కత్తి పీకల మీద కనిపించినా.. ధైర్యంగా ఎదుర్కొనేవారు బాల్‌ ఠాక్రే ! ఆ తెగింపు ఉద్ధవ్‌లో మిస్ అవుతోంది. అందుకే పులి కడుపున పిల్లి అంటూ.. సోషల్‌ మీడియాలో ఉద్ధవ్ ఠాక్రేను ఆడుకుంటున్నారు నెటిజన్లు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పీక్స్‌కు చేరిన వేళ.. బాల్‌ఠాక్రే రాజకీయ ప్రస్థానం.. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తోంది. శివసేన పార్టీలతో.. బాల్‌ఠాక్రే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు. అలాంటిది పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఇదే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌ అవుతోంది.

బాల్‌ఠాక్రే… ముంబైని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని గడగడలాడించిన మహానేత. బాల్‌ ఠాక్రే ఏం చేసినా అది సంచలనమే. సచిన్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని డర్టీ గేమ్‌గా అభివర్ణించిన సాహసి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై వివాదాస్పద కార్టూన్లు వేసేందుకూ వెనుకాడని వ్యక్తి. అన్నా హజారేను కలుసుకునేందుకు కూడా నిరాకరించిన లీడర్‌. అందుకే ఠాక్రే అంటే పార్టీ కార్యకర్తలకే కాదు… కరుడుగట్టిన హిందుత్వవాదులకు అమిత ఇష్టం. 1966లో శివసేన పార్టీని స్ధాపించినా.. 1950 నుంచే మహారాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ చూపించారు బాల్ ఠాక్రే. ఎర్రజెండాను టార్గెట్‌ చేస్తూ.. దేశవ్యాప్తంగా చర్చకు కారణం అయ్యారు.

సంయుక్త మహారాష్ట్ర సమితి పేరుతో.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సాగిన ఉద్యమంలో బాల్ ఠాక్రే కీలక పాత్ర పోషించారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబయి వెలుగొందినా.. అక్కడి ఫలాలు మహారాష్ట్ర వాసులకు.. అందులోనూ మరాఠీలకు అందింది తక్కువే. పెద్దపెద్ద వ్యాపారాలన్నీ గుజారాతీయుల చేతుల్లో.. చిన్న చిన్న వ్యాపారాలు తమిళులు, ముస్లింల చేతుల్లో ఎక్కువగా ఉండేవి. మరాఠీ మాట్లాడేవాళ్లు ముంబయిలో దాదాపు 43 శాతం మంది ఉన్నా.. పెత్తనం అంతా ఇతర రాష్ట్రాల వారిదే. దీన్నే తీవ్రంగా వ్యతిరేకించారు బాల్‌ఠాక్రే. పుంగీ బజావ్‌ లుంగీ హఠావో అంటూ ప్రచారం హోరెత్తించారు. ఆయన ఇచ్చిన స్థానిక పిలుపుతో మహారాష్ట్ర అల్లకల్లో అయింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చిన పరిస్థితి. స్థానికులకు 80శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. ఆ తర్వాత భూమిపుత్రులు అనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అదే సమయంలో 1996లో శివసేన పార్టీని స్థాపించారు. ఛత్రపతి శివాజీ పేరు వచ్చేలా ఆయన తమ పార్టీ కార్యకర్తలకు శివ సైనికులు అని పేరు పెట్టారు.

Also read : GVL On Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం-జీవీఎల్ జోస్యం

1969లో జరిగిన ఒక్క పరిణామం.. శివసేన పార్టీపై దేశవ్యాప్త చర్చకు కారణం అయింది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు సమస్యపై శివసేన ఆందోళనకు దిగగా.. అది కాల్పులకు దారి తీసింది. అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆదేశాలతో పోలీసులు కాల్పులు జరపగా.. 56మంది చనిపోయారు. ఆ తర్వాత బాల్‌ఠాక్రేను అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు. ఈ ఒక్క ఘటన బాల్ ఠాక్రేను.. ముంబైకి మకుటం లేని మహారాజును చేసింది. 1969 పరిణామాల తర్వాత.. బంద్ అనేది శివసేన పార్టీకి ఆయుధంగా మారింది. ఆ బంద్‌లే.. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేలా చేశాయ్. ఇక అదే సమయంలో స్థానికత అనే అంశాన్ని ఆయుధంగా చేసుకొని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. ఉద్యోగాల కల్పనతో పాటు.. పారిశ్రామిక పోత్సాహాల్లో మఠాఠీ యువకులకు పెద్దపీట వేయాలన్న నినాదాలతో.. యూత్‌కు పార్టీని దగ్గర చేశారు.

Also read : Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం

అవకాశాలను పక్కాగా అందిపుచ్చుకోవడం బాల్ ఠాక్రే తర్వాతే ఎవరైనా ! 1987 రామ జన్మభూమి వ్యవహారంతో.. శివసేనను పక్కా పొలిటికల్ పార్టీగా మార్చారు. మఠారీ నుంచి హిందుత్వ నినాదం అందుకున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత తనను తాను హిందూత్వవాదిగా ప్రమోట్‌ చేసుకున్నారు. హిందుత్వ మంత్రతోనే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో శివసేన 73సీట్లు సాధించింది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా కాంగ్రెస్‌ వర్సెస్ కమ్యూనిస్టులుగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో.. శివసేన పేరుతో ఓ ప్రభంజనం సృష్టించారు బాల్ ఠాక్రే. రాజకీయం అంటే ఇలానే చేయాలి అనే గీతను తుడిపేశారు. మహారాష్ట్ర రాజకీయాలను ఓ మలుపు తిప్పారు. మేం హిందువులం అని గర్వంగా చెప్పుకోండంటూ నినదించారు.. అదే ఆ తర్వాత ప్రభంజనం అయ్యింది.

Also read : Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు

వివాదాలు సృష్టించడం బాల్‌ ఠాక్రేకు కొత్తేం కాదు.. హిట్లర్‌ అంటే తనకు అభిమానమని ఓపెన్‌గా ప్రకటించారు. ముస్లీంలపై వ్యతిరేకత తెలపడం.. LTTEకి మద్దతు పలకడం, వాలంటైన్స్‌ డే వేడుకలను వ్యతిరేకించడంలాంటివి ఎన్నో వివాదాలు రేపాయ్. సామ్నా పత్రికలో ఆయన కార్టూన్లు, వ్యాసాలు… కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మిగిలాయ్‌. బతికి ఉన్నంత కాలం.. రాజకీయాల్లో పులి అనిపించుకున్నారు. పార్టీ మీద పట్టు సాధించడంతో పాటు.. తమపై ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేయాలన్న ఆలోచించే స్థాయిలో భయం పుట్టించేవారు బాల్ ఠాక్రే. ఐతే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే విషయంలో మిస్ అయింది అదే ! అందుకే ఎప్పుడూ అధికారం ఆశించని ఠాక్రే కుటుంబం.. సీఎం సీటు కోరుకుంది.. పార్టీని, నాయకులను కంట్రోల్ చేయలేక ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి తెచ్చుకుంది.