తమిళనాడు బేకరీలో మారడోనాకు నివాళిగా 6 అడుగుల కేక్ విగ్రహం

తమిళనాడు బేకరీలో మారడోనాకు నివాళిగా 6 అడుగుల కేక్ విగ్రహం

Cake Statue: తమిళనాడులోని రామనాథపురంలో బేకరీ ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాకు వినూత్నమైన నివాళి సమర్పించింది. 60ఏళ్ల వయస్సున్న మారడోనా నవంబర్ 25న బ్యూనోస్ ఎయిర్స్ లోని తన ఇంట్లో హార్ట్ అటాక్ తో చనిపోయారు. అతనికి తమిళనాడు బేకరీ డిస్ ప్లేలో ఓ టేబుల్ పై పెట్టి ఉన్న 6అడుగుల కేక్ విగ్రహంగా చేసి నివాళి అర్పించింది.

60కేజీల షుగర్, 270 గుడ్లు కలిపి బేకింగ్ చేసి కేక్ రెడీ చేశారు. ‘ఏటా క్రిష్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఈ బేకరీ సెలబ్రిటీల విగ్రహాలు రెడీ చేసి పబ్లిక్ కోసం డిస్ ప్లేకు ఉంచుతుంది. గత కొన్నేళ్లుగా ఇళయరాజా, అబ్దుల్ కలాం, భారతియర్ విగ్రహాలను ఉంచామని బేకరీ ఉద్యోగి సతీశ్ అంటున్నారు.

గత నెలలో చనిపోయిన ఈ ఫుట్‌బాలర్‌కు నివాళిగా విగ్రహం రెడీ చేశాం. యూత్ మొబైల్ ఫోన్, కంప్యూటర్ కు అతుక్కుపోకుండా మైదానంలోకి వచ్చి గేమ్స్ ఆడాలని చెప్పిన గొప్ప వ్యక్తి అని బేకరీ పొగిడేస్తుంది. క్రికెట్‌లో టెండూల్కర్, 100మీటర్ల పరుగుపందెంలో ఉస్సేన్ బోల్ట్, బాక్సింగ్‌లో మైక్ టైసన్ లాగా.. మారడోనా కూడా గుర్తుండిపోతాడు.

డిగో మారడోనా చనిపోవడానికి కొంతకాలం ముందు నుంచి అనారోగ్యంతో బాధపడ్డారు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కు సంబంధించి సర్జరీ జరిగిన అనంతరం ఇంటికి డిశ్చార్జ్ అయిన మారడోనా.. హార్ట్ అటాక్ తో మరణించారు. ఫుట్ బాల్ చరిత్రలోని గ్రేటెస్ట్ ప్లేయర్లలో మారడోనా ఒకరు. 20వ సెంచరీ ఫిఫా ప్లేయర్ అవార్డు గెలుచుకున్న ఇద్దరు జాయింట్ విన్నర్లలో మారడోనా ఒకరు. 1986లో మెక్సికో వేదికగా జరిగిన వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులోనూ మారడోనా ఆడారు.