Tamil Nadu BJP chief Z-Category : తమిళనాడు బీజేపీ చీఫ్‌కి 33 మంది CRPF కమెండోలతో Z కేటగిరీ భద్రత

తమిళనాడు బీజేపీ చీఫ్‌కి 33 మంది CRPF కమెండోలతో Z కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

Tamil Nadu BJP chief  Z-Category : తమిళనాడు బీజేపీ చీఫ్‌కి 33 మంది CRPF కమెండోలతో Z కేటగిరీ భద్రత

Z-Category security to Tamil Nadu BJP chief

Z-Category security to Tamil Nadu BJP chief : తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. అన్నామలైకు మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు రావటంతో 33 మంది సీఆర్పీఎఫ్ (CRPF) కమెండోలతో భద్రతను నియమించనుంది. అన్నామలైకు మావోలు, తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వటంతో ప్రస్తుతం ఆయనకు Y- కేటగిరీ భద్రతను Z-కేటగిరీకి పెంచింది. అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి కూడా.

2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైకు మత తీవ్రవాదుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. అన్నామలై  తమిళనాడుకు చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్ణాటక కేడర్ అధికారిగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పని చేశారు. 2019లో ఐపీఎస్ జాబ్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అన్నామలైకు బీజేపీ ఏకంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అందజేసింది.

కాగా..తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ తో పాటు నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఈక్రమంలో అధికార పార్టీ డీఎంకేను అన్నామలై పదే పదే విమర్శించటం..పలు ఆరోపణలు చేయటం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం స్టాలిన్ కుమారుడు, ఇటీవల మంత్రి పదవి వరించిన ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉగ్రవాదంపై స్టాలిన్ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబిస్తోందంటూ విమర్శిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకు బెదిరింపులు వస్తున్నాయంటూ బీజేపీ వై కేటగిరీ భద్రతను కాస్తా జెడ్ క్యాటగిరీ భద్రతకు పెంచింది.