Online Gambling Games: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు నిషేధం.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

Online Gambling Games: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు నిషేధం.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

Online Gambling Games: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికి పంపుతారు.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

ఆయన ఆమోదం తెలిపిన తర్వాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. నిజానికి గతంలోనే రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, దీన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్ వల్ల రాష్ట్రంలోని యువత, టీనేజర్లు చాలా నష్టపోతున్నారని ప్రభుత్వం.. కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాళ్ల దగ్గరున్న డబ్బును గేమ్స్‌లో కోల్పోతున్నారని కోర్టుకు తెలిపింది. రమ్మీ స్కిల్ గేమ్ అయినప్పటికీ, అది జూదంగా మారిందని కోర్టుకు వివరించింది. మరోవైపు ఈ అంశంపై డీఎమ్‌కే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

Sudha Murthy: మైసూరు రాజ మహిళ పాదాలకు నమస్కరించిన సుధా మూర్తి.. నెటిజన్ల విమర్శలు

మద్రాస్ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె.చంద్రు ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ వల్ల కలిగే నష్టాలపై అధ్యయనం చేస్తోంది. రెండు వారాలక్రితమే ఈ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌‌తోపాటు, వీటికి సంబంధించిన ప్రకటనలపై కూడా నిషేధం విధించాలని ఈ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.