Tamil Nadu : సీఎం సింప్లిసిటీ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి మాస్క్ తొడిగిన స్టాలిన్

తమిళనాడు సీఎం సెక్రటేరియట్ కు వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు మాస్కులు లేకుండా రోడ్డుపై కనిపించారు. దీంతో తన కాన్వాయి ఏపీ.. ఓ యువకుడికి స్వయంగా మాస్క్ తొడిగారు స్టాలిన్

Tamil Nadu : సీఎం సింప్లిసిటీ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి మాస్క్ తొడిగిన స్టాలిన్

Tamil Nadu

Tamil Nadu : ప్రస్తుత కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరైంది. ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే అధికారులు ఫైన్ విధిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారు. బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకొని కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. గాలిద్వారా కరోనా వైరస్ సోకుతుండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాస్క్ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలిపేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్ సెక్రటేరియట్‌కు వెళ్తున్న సమయంలో మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వారిని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి ఓ యువకుడికి తన చేతులతో మాస్క్ తొడిగారు. అనంతరం అక్కడ మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి మాస్క్‌లు అందచేశారు. కరోనా బారినపడకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరని సీఎం స్టాలిన్ తెలిపారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చదవండి : Cm Stalin : టమాటా ధరల కట్టడికి సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం..మార్కెట్ లో దిగివచ్చిన ధరలు

ఇక మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత వారం 10 వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు.. ఈ వారం క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారానికి రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్ సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కేసులు వెలుగుచూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలకోసం బస్టర్ డోసులను సిద్ధం చేస్తోంది. కరోనా రూపాంతరం చెంది వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక పేద దేశాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరిగాయి.

చదవండి  : CM Stalin : మహిళా ఎస్ఐపై సీఎం స్టాలిన్ ప్రశంసలు