CM MK Stalin: డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంది.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకోసం పలు పథకాలు అమలు చేశామని, ప్రజల అభ్యున్నతికోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వంద్వారా లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

CM MK Stalin: డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంది.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

TS CM Stalin

CM MK Stalin: తమిళనాడు రాష్ట్రంలో వలస కార్మికులపై దాడులకు సంబంధించిన నకిలీ వీడియోల చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఎం.కే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు నెలకొనేలా కొన్నిశక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. నాగర్‌కొవిల్ కరుణానిధి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

CTR Nirmal Kumar: బీజేపీకి షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన ఐటీసెల్ ఇంచార్జ్

ఇటీవల బీహార్ తదితర ఉత్తరాధి రాష్ట్రాల కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయని తెలిపారు. అయితే, వీటిపై ప్రభుత్వం స్పందించి ఆరా తీయగా.. అవి నకిలీ వీడియోలు అని తేలిందని స్టాలిన్ చెప్పారు. కొందరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజల్లో ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రచేస్తున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయని స్టాలిన్ అన్నారు.

 

డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకోసం పలు పథకాలు అమలు చేశామని, ప్రజల అభ్యున్నతికోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందడం సహించని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వంపై అనవసర విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పార్టీలోని నాయకులు తగిన విధంగా వ్యవహరిస్తారని స్టాలిన్ అన్నారు.