Police Weekly Off: పోలీసులకు వీక్ ఆఫ్.. పెళ్లి, పుట్టినరోజులకు సెలవులు!

తమిళనాడు రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇకపై పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Police Weekly Off: పోలీసులకు వీక్ ఆఫ్.. పెళ్లి, పుట్టినరోజులకు సెలవులు!

Police

Cops to get weekly off: తమిళనాడు రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇకపై పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, పుట్టినరోజు, పెళ్లి రోజున కూడా సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తమిళనాడు ప్రభుత్వం ఈమేరకు పోలీసుల కోసం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ ఇస్తున్నట్లు చెప్పింది.

పోలీసు డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.శైలేంద్రబాబు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేస్తూ.. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వారి కుటుంబంతో గడపడానికి వీలుగా ప్రతి వారం తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు డీజీపీ శైలేంద్ర బాబు.

ఒకవేళ ఈ సెలవుల్లో తప్పక పని చేయాల్సి వస్తే మాత్రం ఎక్స్‌ట్రా జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.