Elephant Retirement : ఏనుగు పదవీ విరమణ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ సెల్యూట్ చేసిన అధికారులు..గౌరవ వందనం స్వీకరించిన గజరాజు

60 ఏళ్ల వయస్సులో ఓ ఏనుగు పదవీ విరమణ పొందింది. దీంతో ప్రభుత్వ అధికారులు దానికి సెల్యూట్ చేసిన ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించింది ఆ గజరాజు ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ వీడ్కోలు పలికారు.

Elephant Retirement : ఏనుగు పదవీ విరమణ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ సెల్యూట్ చేసిన అధికారులు..గౌరవ వందనం స్వీకరించిన గజరాజు

Tamil Nadu Forest Department Kumki Elephant Kaleem Retirement 

Elephant Retirement : ఓ ఏనుగు రిటైర్ అయ్యింది. ఆ రిటైర్మెంట్ అయినా ఆ ఏనుగుకు ప్రభుత్వ అధికారులు అత్యంత ఘనంగా వీడ్కోలు పలికారు. నిన్ను మర్చిపోలేం మిత్రమా? అంటూ బరువెక్కిన హృదయాలతో భావోద్వేం చెందారు. అదేంటీ ఏనుగు ఏమన్నా ఉద్యోగం చేస్తుందా? రిటైర్ అవ్వటమేంటీ? అని అనుకోవచ్చు. కానీ ఇది నిజమే. మనుషులకు జంతువులకు ఎంతో అవినావభావ సంబంధముంటుంది. ముఖ్యంగా ఆయా అధికారులు చేసే డ్యూటీల్లో తాము సైతం అంటూ భాగం పంచుకున్న జంతువులు దూరమైన వారికి ఎంతో బాధగా ఉంటుంది. అలా దాదాపు 100 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న ఓ ఏనుగు రిటైర్ అవ్వగా ఆ ఏనుగుకు అటవీ శాఖ అధికారులు ఎన్నో ఏళ్లుగా పెనువేసుకున్న వారి బంధానికి అత్యంత ఘనంగా వీడ్కోలు పలికారు. నిన్ను మర్చిపోలేం మిత్రమా? అంటూ చెమ్మగిల్లిన కళ్లతో..బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Gold locket for Cat Gift :పెంపుడు పిల్లికి రూ.4 లక్ష‌ల విలువైన గోల్డ్ లాకెట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని

తమిళనాడు అనమలై టైగర్ రిజర్వ్‌ (Tamil Nadu Reserve Forest Departmen)కు చెందిన ఓ ఏనుగు పదవీవిరమణ (Retirement)కు అక్కడి అటవీ పోలీసధికారులను భావోద్వేగానికి గురి చేసింది. సెల్యూట్ చేసి ఆ ఏనుగుకు వీడ్కోలు పలికారు అధికారులు. సంబంధించిన సంఘటన. తమిళనాడులో ఓ కుమ్కీ (kumki elephant) ఏనుగు 60 ఏళ్ల వయసులో మంగళవారం (మార్చి 7,2023) పదవీ విరమణ పొందింది (గాయపడిన లేదా ఇతర ప్రమాదాల్లో చిక్కుకున్న ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులను కుమ్కీ ఏనుగులు అంటారు. వివిధ రెస్క్యూ ఆపరేషన్లలో అటవీ అధికారులు ఈ ఏనుగులను ఉపయోగిస్తారు). ఈక్రమంలో కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ‘కలీమ్‌’ (Kaleem)అనే కుమ్కీ ఏనుగు పదవీ విరమణ చేసింది.

Hero Rat: కంబోడియాలో మందుపాతరలను కనిపెట్టిన “హీరో ఎలుక” మృతి

ఈ సందర్భంగా సందర్భంగా అటవీ అధికారులు గౌరవ వందనం (Guard of Honour‌) చేసి ఏనుగు పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కలీమ్‌ 99 రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొంది.ఆ ఆపరేషన్ల సమయంలో కలీమ్ చాలా శ్రమించేది. దీంతో కలీమ్ అటవీశాఖ సిబ్బంది మనస్సుల్ని గెలుచుకుంది. కలీం అనే ఈ ఏనుగు తమిళనాడులోని వివిధ జిల్లాలతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాలలో మానవ ఆవాసాలలోకి ప్రవేశించే అడవి ఏనుగులను వెంబడించడం నుండి జంబోలను పట్టుకోవడం వరకు 99 ఆపరేషన్లలో పాల్గొంది.

హిస్టరీలో ఫస్ట్ టైమ్ : CISF డాగ్‌లకు గ్రాండ్ సెండాఫ్

కలీమ్ కు వీడ్కోలు పలికే వీడియోను తమిళనాడు అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు సోషల్‌ మీడియలో పోస్టు చేశారు. ‘కుమ్కీ ఏనుగు ‘కలీం’ ఈ రోజు పదవీవిరమణ పొందింది. తమిళనాడులోని అనమలై టైగర్ రిజర్వ్‌లోని 99 రెస్క్యూ ఆపరేషన్ల(Rescue operations) లో పాల్గొన్న కలీం ఓ లెజెండ్‌. కలీమ్‌ పదవీ విరమణ చేస్తుంటే మా కళ్లు చెమ్మగిల్లాయి. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయని’ సుప్రియా సాహు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగు ముందు నిలబడి సెల్యూట్‌ చేయడం కనిపిస్తుంది. వెంటనే ఏనుగు ఘీంకరిస్తూ తొండం పైకెత్తి అది కూడా వందనం చేయడం కనిపిస్తోంది.

World Elephant Day:ప్రపంచంలోనే వృద్ధ ఏనుగు విశేషాలు..చేసిన పనికి పెన్షన్ తో రాయల్ లైఫ్