తమిళనాడు పాలన తమిళనాడు నుంచే : స్టాలిన్ సీఎం అవుతారు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.

తమిళనాడు పాలన తమిళనాడు నుంచే : స్టాలిన్ సీఎం అవుతారు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. కృష్ణగిరిలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ…త్వరలోనే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్  తమిళనాడు సీఎం అవుతారన్నారు. నాగ్ పూర్ (ఆర్ఎస్ఎస్) నుంచి తమిళనాడును పాలించేందుకు తమ పార్టీ, భాగస్వామ్య పక్షాలు ఎప్పటికీ అనుమతించబోమన్నారు. తమిళనాడు నుంచే తమిళనాడులో పాలన జరుగుతుందన్నారు.
Read Also : EVMలు బ్యాన్ చెయ్యాలి : చంద్రబాబు సంచలన డిమాండ్

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పేదలకు కనీస ఆదాయం పథకం ‘న్యాయ్’ ద్వారా పేదలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని, తమిళనాడులోని ఫ్యాక్టరీలు పుంజుకోవడంతో పాటు ఆర్థికంగా నిలబడతాయని రాహుల్ అన్నారు.తమిళనాడు, తిరుపూరు, కాంచీపురం వంటివి వస్త్ర పరిశ్రమలకు పెట్టింది పేరని, ఆ పరిశ్రమలకు మరింత ఊతం లభించి యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రధాని మోడీ తన 15మంది మిత్రుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఒక్క మిత్రుడినీ ఆయన జైలుకు పంపకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాహుల్ అన్నారు.బడాబాబులు రుణాలు చెల్లించకపోతే వాళ్లను జైలుకు పంపకుండా అదే కారణంతో రైతులను మాత్రం జైళ్లకు పంపుతారన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రుణాలు చెల్లించలేదనే కారణంతో ఏ ఒక్క రైతును కూడా జైలుకు పంపమని అన్నారు.