CM MK Stalin Birthday : సీఎం స్టాలిన్ పుట్టినరోజు..ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో జ‌న్మించే పిల్లలకు బంగారు ఉంగరం గిఫ్ట్

తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ‌న్మించే శిశువుల‌కు బంగారు ఉంగరం బహుమతిగా ఇస్తామని డీఎంకే తిరువ‌ళ్లూరు జిల్లా క‌న్వీన‌ర్ భూప‌తి ప్ర‌క‌టించారు

CM MK Stalin Birthday : సీఎం స్టాలిన్ పుట్టినరోజు..ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో జ‌న్మించే పిల్లలకు బంగారు ఉంగరం గిఫ్ట్

Cm Mk Stalin Birthday

CM MK Stalin Birthday : మార్చి 1న తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు.ఈ శుభ సందర్భంగా తిరువ‌ళ్లూరు జిల్లా ప‌రిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ‌న్మించే శిశువుల‌కు బంగారు ఉంగరం బహుమతిగా ఇస్తామని డీఎంకే తిరువ‌ళ్లూరు జిల్లా క‌న్వీన‌ర్ భూప‌తి ప్ర‌క‌టించారు.

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సింపుల్ గా ఉంటారు. సీఎం హోదాలో ఉన్నా ఏమాత్రం దర్పం ప్రదర్శించని వ్యక్తి. సీఎంగా ఉన్నా హంగూ ఆర్భాటాలు ప్రదర్శించరు. సరికదా..సామాన్య ప్రజల్ని కూడా ఆప్యాయంగా పలుకరిస్తారు. కష్టసుఖాలు తెలుసుకుంటారు. కానీ స్టాలిన్ పార్టీ నేతలు మాత్రం ఆయన పుట్టిన రోజుని ఘనంగా చేద్దామనుకున్నారు. పేద‌ల‌కు సహాయం చేద్దామనే ఆలోచనతో మార్చి 1 సీఎం స్టాలిన్ బ‌ర్త్ డే శుభ సందర్భంగా..ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని డీఎంకే నేత‌లు నిర్ణ‌యించుకున్నారు. దీంట్లో భాగంగా ఆ పార్టీకి చెందిన తిరువ‌ళ్లూరు జిల్లా క‌న్వీన‌ర్ స్టాలిన్ జ‌న్మించిన మార్చిన 1న ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ‌న్మించే పిల్ల‌ల‌కు ఏకంగా బంగారు ఉంగ‌రాల‌ను బ‌హూక‌రిస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అది రాష్ట్రమంతటా కాదు కేవలం జిల్లా ప‌రిధిలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో జ‌న్మించే పిల్ల‌ల‌కే ఈ గోల్డ్ రింగులు ఇస్తాన‌ని చెప్పారు. తిరువ‌ళ్లూరు జిల్లా ప‌రిధిలోని తిరుత్త‌ణిలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో డీఎంకే జిల్లా క‌న్వీన‌ర్ భూప‌తి గోల్డ్ రింగుల విష‌యాన్ని ప్ర‌కటించారు. సీఎం జ‌న్మ‌దినం రోజున భారీగా వేడుక‌లు నిర్వ‌హించ‌డంతో పాటుగా పేద‌ల‌కు చేత‌న‌యినంత మేర సాయం చేయాల‌ని భూప‌తి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.ప్రకటించినట్లుగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చి 1న పుట్టిన శిశువులకు బంగారు ఉంగరాలను అందజేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రు.తల్లులకు పండ్లు, బేబీ కిట్స్,శిశువులకు బంగారు ఉంగరాలు అందించటానికి ఎమ్మెల్యే ఇ.కరుణానిధి ఏర్పాట్లు చేశారు.

కాగా.. సీఎం ఎంకే స్టాలిన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్.. స్టాలిన్‌కు ఫోన్ చేసి బ‌ర్త్ విషెష్ చెప్పారు. స్టాలిన్ ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. త‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.