Jallikattu Competitions : జల్లికట్టు పోటీలకు తమిళనాడు సర్కార్ అనుమతి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహణ

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. జల్లికట్టు పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఇవాళ జల్లి కట్టు పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జల్లికట్టుకు మదురై సిద్ధమయింది.

Jallikattu Competitions : జల్లికట్టు పోటీలకు తమిళనాడు సర్కార్ అనుమతి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహణ

jallikattu

Jallikattu Competitions : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. జల్లికట్టు పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఇవాళ జల్లి కట్టు పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జల్లికట్టుకు మదురై సిద్ధమయింది. మధురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలకు ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ప్రాంతంలో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. తొలి జల్లికట్టు క్రీడకు అవనియాపురం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులోని అవనియాపురం, సాలమేడు, అలంగనూరు ప్రాంతాల్లో ప్రాచీన సాహస క్రీడ జల్లికట్టును నిర్వహిస్తున్నారు.

ఇక అవనియాపురం జల్లికట్టులో ఏళ్ల తరబడి నిర్వహిస్తూ వచ్చిన తెంకాలు సాగునీటి రైతుల సంఘానికి, అవనియాపురం గ్రామ కమిటీకి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఈ సారి జల్లికట్లు పోటీలను జిల్లా యంత్రాంగం, పురపాలక సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.  ఈ పోటీల నిర్వహణకు పురపాలక సంఘం రూ.17 లక్షల టెండర్ ను పిలిచి మరీ ఏర్పాటు చేసింది. వారివాసలు నిర్మించి బారికేడ్లను ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల గ్యాలరీ, వెటనరీ పరిశీలన కేంద్రాలు,
ఇవాళ జరిగే జల్లికట్టు క్రీడలో 800 ఎద్దులు పాల్గొంటున్నాయి.

Chittoor Rangampeta : రంగంపేట జల్లికట్టు తీరు తెలుసా.. పలకలు చేజిక్కించుకున్న వాడే మొనగాడు

వీటిని అణిచివేయడానికి మధురై, శివగంగై, దెండుగల్, తేని తదితర జిల్లాలకు చెందిన 400 మంది సాహస క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిని రౌండ్ల వారిగా జల్లికట్టు మైదానంలోకి అనుమతించనున్నారు. ఎద్దులను అణిచివేసే క్రీడాకారులకు ఎవరికి పట్టు చిక్కకుండా తప్పించుకునే ఎత్తుల యజమానులకు బహుమతులు ప్రధానం చేయనున్నారు.

సైకిళ్లు, బీరువాలు, బంగారు కాసులు తదితర కానులను వీరికి అందిస్తారు. జల్లికట్టుకు సంబంధించి హెల్త్ డిపార్ట్ మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జల్లికట్టులో గాయపడిన వారికి తక్షణం చికిత్స అందించడానికి వైద్య బృందాలు రెడీగా ఉన్నాయి. ఆరు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. ఈ పోటీల్లో గొడవలు జరుగకుండా భద్రతా కూడా పెంచారు.