School Teacher: విద్యార్థినిలపై టీచర్ లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన అధికారులు

ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

School Teacher: విద్యార్థినిలపై టీచర్ లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన అధికారులు

School Teacher: విద్యాబుద్ధులు చెప్పి, సత్ప్రవర్తనతో ఆదర్శంగా నిలవాల్సిన టీచర్ స్కూల్లోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు విషయం బయటపడటంతో అధికారులు ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడు, హోసుర్ జిల్లాలోని పికనాపల్లిలో జరిగింది.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణకు ఆదేశించారు. గోవిందన్ అనే జిల్లా విద్యా శాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. దీనిలో మంజునాథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం నిజమేనని తేలింది. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో అధికారులు నివేదికను పరిశీలించి, మంజునాథ్‌ను సస్పెండ్ చేశారు.

Bihar: హిట్ అండ్ డ్రాగ్.. బిహార్‌లో వృద్ధుడిని ఢీకొని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వృద్ధుడు మృతి

అతడు చాలా మంది అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డట్లు రుజువైంది. దీంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు అతడిపై పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. త్వరలోనే అతడ్ని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అతడిపై జీవిత కాలం నిషేధం విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ టీచర్‌గా అవకాశం ఇవ్వకూడదని కోరుతున్నారు.