ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్లాంట్ రీ ఓపెన్

ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్లాంట్ రీ ఓపెన్

Vedantas Sterlite

Vedanta’s Sterlite ఆక్సిజన్​ ఉత్పత్తి కోసం నాలుగు నెలల పాటు తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్​ యూనిట్​ను తిరిగి ప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. సోమవారం సీఎం పళనిస్వామి అధ్యక్షతన జరగిన ఆల్ పార్టీ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పోల్యూషన్ కారణాలతో మే-2018 నుంచి మూసివేసిన ఈ కాపర్​ యూనిట్​ను తిరిగి ప్రారంభించనున్నారు.

కాగా,గత వారం… వేల టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి,దానిని ఉచితంగా కోవిడ్ పేషెంట్ల ట్రీట్మెంట్ కు వాడేందుకు అందిస్తామని,కాబట్టి తమ ఫ్లాంట్ ను తెరిచేందుకు అనుమతించాలని వేదాంత దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. ఆక్సిజన్ కొరతతో ప్రతి రోజూ చాలామంది కోవిడ్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారని,ఇటువంటి సమయంలో స్టెరిలైట్ ఫ్లాంట్ ను తెరిచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. స్టెరిలైట్ ఫ్లాంట్ ను వేదాంత లేదా మరొకరు రన్ చేస్తున్నారన్నా అన్న దాంట్లో తమకు ఆశక్తి లేదని,ఆక్సిజన్ ఉత్పత్తిపైనే తమకు ఆశక్తి ఉందని అప్పటి సీజేఐ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు.