రైతు రుణాలు మాఫీ చేసిన తమిళనాడు ప్రభుత్వం

రైతు రుణాలు మాఫీ చేసిన తమిళనాడు ప్రభుత్వం

Tamil Nadu అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో తమిళనాడు సీఎం కే పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని రైతులకి తీపి కబురు చెప్పారు. సహకార బ్యాంకుల్లోని రూ.12,110 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు.

దీని ద్వారా 16.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని సీఎం పళనిస్వామి తెలిపారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలని నెరవేర్చే మరియు కొత్త సంక్షేమ పథకాలను తీసుకొచ్చే ఏకైక పార్టీ ఏఐఏడీఎంకే అని ఈ సందర్భంగా పళనిస్వామి తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలని నేరువేరుస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అయితే ప్రతిపక్ష డీఎంకే పై సీఎం విమర్శలు గుప్పించారు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 2 ఎకరాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.