Omicron : ఆంక్షలు మరింత కఠినం చేయండి.. కేంద్రాన్ని కోరిన రాష్ట్రం

కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం లేఖ రాశారు.

Omicron : ఆంక్షలు మరింత కఠినం చేయండి.. కేంద్రాన్ని కోరిన రాష్ట్రం

Omicron (2)

Omicron : దక్షిణ ఆఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచంలోని 89 దేశాలకు పాకింది. భారత్ లో కూడా ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. సౌత్ ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా రాత్రి కర్ఫ్యూకి సంబందించిన గైడ్ లైన్స్.. రాత్రి కర్ఫ్యూపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. కేసుల తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలు కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశాయి.ఇక ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రంలో కరోనా నింధనలు మరింత కఠినంగా అమలు చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

చదవండి : Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడంతో.. ఆ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మునుపటి కరోనా నిరోధక నిబంధనలలో కొన్నింటిని అమలు చేస్తే బాగుంటుందని లేఖలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో ఇప్పటికే ఓ ఒమిక్రాన్ కేసు నమోదైందని.. మరో 28 మందికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. WHO హెచ్చరికల నేపథ్యంలో మరింత కఠిన కరోనా నిబంధనలు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మరి తమిళనాడు విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

చదవండి : Pfizer On Corona End : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ