రేప్ కేసు పెట్టిన యువతి షాక్ ఇచ్చిన కోర్టు…యువకుడికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు

  • Published By: nagamani ,Published On : November 21, 2020 / 02:19 PM IST
రేప్ కేసు పెట్టిన యువతి షాక్ ఇచ్చిన కోర్టు…యువకుడికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు

Tamil Nadu chennai court : తప్పుడు కేసులు పెట్టి న్యాయ స్థానం విలువైన సమయాన్ని వృథా చేయటంకూడా నేరమే. అలాగే రేప్ జరిగిందని తప్పుడు కేసులు పెట్టటంకూడా నేరమే. ఇదిలా ఉండగా రేప్ మా అమ్మాయిని ఫలానా అబ్బాయి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పెట్టినకేసు విషయంలో చెన్నై కోర్టు సదరు యువతి కుటుంబానికి భారీ షాక్ ఇచ్చింది. సదరు అబ్బాయి కుటుంబానికి రూ.15లక్షలుపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.



వివరాల్లోకి వెళితే..తమిళనాడుకు చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబం నివసిస్తోంది. సంతోష్ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. వారి ఇంటి పక్కనే ఓ యువతి తన కుటుంబంతోనివసిస్తోంది. సంతోష్ కుటుంబం..ఆ యువతి కుటుంబం స్నేహంగా ఉండేవారు. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో సంతోష్‌తో ఆ యువతి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అనుకునేవాడు. దీంతో సంతోష్, ఆ అమ్మాయి కూడా చనువుగా ఉండేవారు. ఆటపట్టించుకునేవారు.
https://10tv.in/newly-wedding-couple-escaped-after-entering-girl-friend/


ఇలా స్నేహంగా ఉంటున్నవారి కుటుంబాల మధ్య ఇచ్చుపుచ్చునే విషయంలో ఆస్తి వివాదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరికీ పెళ్లి చేయాలనుకునే విషయంలో కూడా విభేదాలు వచ్చాయి. దీంతో సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. ఈక్రమంలో సదరు యువతి గర్బం దాల్చింది. దీంతో సంతోష్ తన కూతురిని లొంగదీసుకున్నాడనీ ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. దానికి సంతోష్ గానీ..అతని కుటుంబం గానీ ఒప్పుకోలేదు. మీ అమ్మాయి వచ్చిన గర్భానికి నాకు ఎటువంటి సంబంధం లేదనీ తనతో తాను ఎప్పుడూ అటువంటి సంబంధం పెట్టుకోలేదని చెప్పాడు.



కానీ యువతి కుటుంబం ఒప్పుకోలేదు. సరికదా..యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో 2009 నవంబరులో సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేసి 95 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో పెట్టారు. ఆ తరువాత 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు.ఈ లోగా అతడిపై కేసు పెట్టిన యువతికి నెలలు నిండాయి. ఓ పాపకు జన్మనిచ్చింది. కోర్టులో కేసు కొనసాగుతునే ఉంది. దీంతో ఆ పాప సంతోష్ వల్ల పుట్టిన బిడ్డా కాదా? అని నిర్ధారించేందుకు ఆ శిశువుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా..సంతోష్ ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదని తేలింది.



అయినా సరే ఈ కేసు అలా కొనసాగి 2016, ఫిబ్రవరి 10న చెన్నై Mahila court అతడిని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది. అనంతరం తనపై అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఆ యువకుడు పరువు నష్టం దావా వేశాడు. రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు.



దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పునిస్తూ సదరు యువతి కుటుంబం సంతోష్ ను..అతని కుటుంబాన్ని ఇంత కాలం మానసిక వేదనకు చేసినందుకు నష్టపరిహారంగాను..పరువు తీసినందుకు పరిహారంగానూ రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది. దీంతో చేసేదేమీ లేక సదరు యువతి కుటుంబం ఆ డబ్బు చెల్లించేందుకు అంగీకరించింది.