Mother Murdered : తల్లిని చంపి..రక్తంలో ఆడుకున్న ఇద్దరు కూతుళ్లు..

కన్న కూతుళ్లే తల్లిని దారుణంగా చంపి తల్లి రక్తంలో ఆడుకున్న ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. తల్లి రక్తాన్ని బొమ్మలకు..దేవుడి పటాలకు రాసి నవ్వుకుంటున్న దృశ్యాలను చూసి కూతుళ్లను చూసి పోలీసులే భయపడిపోయారు.

Mother Murdered : తల్లిని చంపి..రక్తంలో ఆడుకున్న ఇద్దరు కూతుళ్లు..

Mother Murdered In Tamil Nadu

Mother Murdered in Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అంత్యంత దారుణం చోటుచేసుకుంది. కన్న కూతుళ్లే తల్లిని దారుణంగా చంపి తల్లి రక్తంలో ఆడుకున్న ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. తల్లి రక్తాన్ని బొమ్మలకు రాసి నవ్వుకుంటున్న దృశ్యాలను చూసి కూతుళ్లను చూసి పోలీసులే భయపడిపోయారు. తల్లిని చంపిన ఇద్దరు కూతుళ్లు ఇంజనీరింగ్ చదివినవారే కావటం గమనించాల్సిన విషయం.

అది తిరునెల్వేలి జిల్లాని మున్సిపల్ ఏరియాలోని పాళయంకోటై ప్రాంతంలోని కేటీసీనగర్‌. అక్కడ రైల్వే ఉద్యోగిగా పనిచేసిన రిటైర్ అయిన కోయిల్‌పిచ్చై, ఉషా దంపతులు నివసించేవారు. వీరిద్దరూ మనస్పర్ధలతో విడిపోయారు. వీరికి21 ఏళ్ల నీనా, 19 ఏళ్ల రీనా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోయిల్‌పిచ్చై మున్నీర్‌పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనాలు ఇద్దరు తల్లిదగ్గరే ఉంటున్నారు. వీరిద్దరూ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఈక్రమంలో గత కొద్ది నెలల నుంచి నీనా, రీనాలకు మతిస్థిమితం లేకుండా పోయింది.

దీంతో ఉషా వారిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈ క్రమంలో గత మంగళవారం (జులై 21,2021) మధ్యాహ్నం తల్లి ఉషతో కూతుళ్లు ఇద్దరూ గొడవపడ్డారు. ఇదంతా ఇరుగు పొరుగువారికి సర్వసాధారణమే కావటంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి ఉషా మరునాడు ఉదయం నుంచి కనిపించకపోవటంతో అనుమానం వచ్చింది. ఈక్రమంలో నీనా, రీనాల అరుపులు వినిపించటంతో ఏం జరిగిందా అని ఇరుగుపొరుగువారు ఉషా ఇంటికి వచ్చి చూశారు. అంతే ఒక్కసారిగా భయపడిపోయారు. వారి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇల్లంతా రక్తం పారుతోంది. ఆ రక్తంలో ఉషా నిర్జీవంగా పడి కనిపించింది.

మతిస్థిమితం లేని ఆ పిల్లలు కన్నతల్లిని తల్లిని కొట్టి చంపినట్లుగా అర్థం అయ్యింది వారికి. తల్లి రక్తంలో కూతుళ్లు ఇద్దరూ ఆడుకోవడం చూసిన ఇరుగుపొరుగువారు హడలిపోయారు. ఆ దృశ్యం వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లి రక్తాన్ని బొమ్మలకు పూస్తూ ఆడుకుంటుండడం స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. చేసేదేమీ లేక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు అక్కడి సీన్‌ చూసి షాక్‌కు గురయ్యారు. తల్లి రక్తపు మడుగులో ఉంటే.. పక్కన బొమ్మలతో ఆడుకుంటూ కనిపించారు ఇద్దరు కూతుళ్లు. దేవుడి బొమ్మలకు రక్తం పూస్తూ ఆడుకుంటున్న ఆ కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం ఉష మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

కత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు తేలింది. తల్లిని హతమార్చిన మతిస్థిమితం లేని ఇద్దరు కుమార్తెలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారికి మతిస్థితిమితం తప్పటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న ఇద్దరూ అలా మతిస్థిమితం లేకుండాపోవటానికి గల కారణాలేమిటి? తల్లిదండ్రులు విడిపోయినందువల్లే ఇలా తయారయ్యారా? లేదా మరేమైనాకారణాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.