Tamil Nadu: చైనా నుంచి తమిళనాడు వచ్చిన తల్లీకూతురుకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.

Tamil Nadu: చైనా నుంచి తమిళనాడు వచ్చిన తల్లీకూతురుకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

Tamil Nadu: చైనా నుంచి తమిళనాడు వచ్చిన తల్లీకూతురుకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు ఇద్దరినీ హోమ్ ఐసోలేషన్ తరలించారు. తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు.

Russia: జీ7 దేశాలకు రష్యా షాక్.. ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేత

అక్కడ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయణికులు అందరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అధికారులు ఆ ఇద్దరినీ, హోమ్ ఐసోలేషన్‌కు తరలించారు. వారి ద్వారా కరోనా ఇతరులకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. వాళ్లిద్దరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం తమిళనాడులో పది కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం అక్కడ యాక్టివ్ కేసులు 51 ఉన్నాయి.

Police Recruitment: గర్భిణి అభ్యర్థులకు శుభవార్త.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే మెయిన్స్ పరీక్షకు అనుమతి

చైనాతోపాటు జపాన్, అమెరికా, కొరియా వంటి దేశాల్లో కోవిడ్ భారీ స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.