Ola Future Factory: ఓలా E-స్కూటర్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారంతా మహిళలే

తమిళనాడులో స్థాపించబడిన ఓలా E-స్కూటర్ ఫ్యాక్టరీలో 10,000మంది మహిళా సిబ్బందితో ప్రపంచవ్యాప్తంగా ఏకైక మహిళల ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారనుంది.

10TV Telugu News

Ola Futurefactory to be run entirely by women : ఓలా E-స్కూటర్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ స్కూటర్ తయారు చేసిన చేతుల వెనుక మహిళల కృషి ఉందని మీకు తెలుసా? ఈ ఓలా స్కూటర్ ఫ్యాక్టరీలో కార్మికులంతా మహిళలే అనే విషయం తెలుసా? ఇన్నాళ్లు ఫ్యాక్టరీలను పురుషులే నడిపారు. కానీ ఇకనుంచి మహిళలే ఫ్యాక్టరీని నడిపించనున్నారు. ఒక ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీలో మహిళలే కార్మికులుగా ఉండటమనేది అంత్యంత అరుదైన విషయం. కానీ ఓలా దాన్ని సుసాధ్యం చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫ్యాక్టరీలో 10 వేల మంది మహిళా కార్మికులను భర్తీ చేయనుంది ఓలా. ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు పని చేసే క్టరీ, ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీ ఇది ఒక్కటే కావటం గమనించాల్సిన విషయం. ఈ పర్యావరణ హిత స్కూటర్‌ ఫ్యాక్టరీని మహిళల చేతులమీదే అన్ని స్కూటర్లు తయారుకానున్నాయి.

Read more : 94 ఏళ్ల బామ్మ..ఆమే పేరే బ్రాండ్..స్టార్టప్ తో లక్షలు సంపాదన

తమిళనాడు కృష్ణగిరి సమీపంలోని 500ల ఎకరాల విస్తీర్ణయంలో స్థాపితమైన ‘ఓలా ఈ–స్కూటర్‌ ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ పూర్తిగా మహిళా కార్మికులతో, సిబ్బందితో పని చేయనుంది. 10 వేల మంది స్త్రీలు ఈ ఓలా ఫ్యాక్టరీలో పని చేయనున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే మొదటి మహిళా బ్యాచ్‌ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యింది. మరో ఐదు లేక ఆరు నెలల్లో ఈ స్కూటర్ ఫ్యాక్టరీ అంతా మహిళా కార్మికులతో నిండిపోనుంది. దీంతో ఇదొక అద్భుతమైన స్త్రీ కార్మిక వికాసంగా మారనుంది. ఈ అరుదైన ఘట్టానికి ఓలా వేదికగా నిలిచింది. ఇంత భారీ సంఖ్యలో మహిళా వర్కర్స్ ను రిక్కూట్ చేసుకున్న ఓలా కొత్త చరిత్ర లిఖించినట్లు అవుతుంది.

ఓలా చైర్మన్‌– గ్రూప్‌ సి.ఇ.ఓ భవిష్‌ అగర్వాల్‌ ఈ అరుదైన ఘట్టం గురించి సంతోషాన్ని వ్యక్తంచేస్తు..సోమవారం ఈ సంతోషకరమైన వార్తను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..‘స్త్రీ ఆర్థికంగా బలపడితే కుటుంబం మొత్తం బలపడుతుంది..తద్వారా సమాజం కూడా బలపడుతుంది..’ అని అన్నారు. ఇప్పటికే ‘మా మొదటి బ్యాచ్‌ వచ్చింది. మిగిలిన వారు రావడమే మిగిలి ఉంది‘ అని అన్నారు. ఈ శుభ సందర్భంగా భవిష్ అగర్వాల్ ఈ–స్కూటర్‌ తయారు చేయనున్న ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలోని దాదాపు 100మంది తొలి మహిళా కార్మిక బ్యాచ్‌తో ఆయన సెల్ఫీ దిగారు. దాంతో సమాజం బలపడుతుంది. మహిళా ఆర్థిక స్వావలంబనతో జి.డి.పి పెరుగుతుంది’ అని అన్నారు.

Read more : ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధన్ : గడ్డిపోచలతో రాఖీలు తయారు చేస్తున్న ఒడిశా మహిళలు

అలాగే పారిశ్రామిక రంగంలో మహిళల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అని అన్నారు. ‘పారిశ్రామిక రంగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉంది. ఈ శాతం పెంచాలంటే అందరం కలిసి స్త్రీలను ప్రోత్సహించాలి.మహిళలల్లో శక్తియుక్తులకు ఏమాత్రం లోటులేదు. ఆ శక్తిని ఆర్థికంగా మెరుగుపడేందుకు ఉపయోగించాలి..అందకే మా వంతుగా మేము ఓలా ఈ–స్కూటర్‌ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలతోనే నిర్వహించాలని నిర్ణయించాం. దాన్ని అమలు చేస్తున్నాం’ అని అన్నారు.

Read more : ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధన్ : గడ్డిపోచలతో రాఖీలు తయారు చేస్తున్న ఒడిశా మహిళలు

పర్యావరణానికి హాని చేసే పెట్రోల్‌ టూవీలర్లకు ప్రత్యామ్నాయంగా ఈ–స్కూటర్‌ల తయారీ దేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఓలా ఈ రంగంలో ప్రధాన వాటా పొందేందుకు భారీ స్థాయిలో ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని తమిళనాడులోని కృష్ణగిరిలో స్థాపించింది. ఇది పూర్తి కావడానికి సుమారు 2500 కోట్లు అవుతాయని అంచనా చేయగా..2022లో మార్కెట్‌లోకి వచ్చే లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీ పని చేయనుంది. ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్‌ తయారయ్యే స్థాయిలో వేల మంది మహిళలు పనిచేయనున్నారని..ఇక్కడ అంతా మహిళా సిబ్బందే పనిచేస్తారని..వీరికి 3000 రోబోలు సహకరించనున్నాయని ఓలా చైర్మన్‌– గ్రూప్‌ సి.ఇ.ఓ భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు.

 

10TV Telugu News