Tamilnadu Covid Doses : తమిళనాడుకు కోటిపైనే కరోనా టీకా డోసులు..

తమిళనాడులో కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఉందంటూ వచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. దక్షిణాది రాష్ట్రానికి కోటికి పైగా వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది.

Tamilnadu Covid Doses : తమిళనాడుకు కోటిపైనే కరోనా టీకా డోసులు..

Tamilnadu Covid Doses

Tamilnadu Covid Doses : తమిళనాడులో కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఉందంటూ వచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు కోటికి పైగా వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది. తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటివరకు 93.3 లక్షల మోతాదులను ప్రజలకు అందించినట్లు కేంద్రం తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో వ్యాక్సిన్ల కొరతపై కొన్ని నివేదికలు వచ్చాయి. ఈ నివేదికలు వాస్తవంగా తప్పుని, ఎలాంటి ఆధారం లేవని పేర్కొంది. జూన్ 2 నాటికి తమిళనాడుకు కోటికి పైగా కొవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేయగా, అందులో 93.3 లక్షల మోతాదులు అందుకున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7.24 లక్షల మోతాదులు అందుబాటులో ఉన్నాయి. జూన్ మొదటి, రెండవ పక్షం రోజులకు భారత ప్రభుత్వం నుంచి ఉచితంగా వ్యాక్సిన్ల మోతాదులను తమిళనాడుకు అందించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జూన్ 1 నుంచి జూన్ 15 వరకు భారత ప్రభుత్వం ద్వారా తమిళనాడుకు మొత్తం 7.48 లక్షల వ్యాక్సిన్ మోతాదులు అందాయి. అలాగే తమిళనాడుకు అదనంగా 18.36 లక్షల వ్యాక్సిన్ మోతాదులు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు లభిస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.