Udayanidhi Slalin : మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్ .. క్రీడాశాఖా మంత్రిగా బాధ్యతలు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్ లోకి ‘వారసుడొచ్చాడు’. సీఎం స్టాలిన్ కుమారుడు..సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్ ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Udayanidhi Slalin : మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్ .. క్రీడాశాఖా మంత్రిగా బాధ్యతలు

Udayanidhi Slalin, who took oath as the Minister.

Udayanidhi Slalin In MK Slalin Cabinet : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్ లోకి ‘వారసుడొచ్చాడు’. సీఎం స్టాలిన్ కుమారుడు..సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్ ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. MK Stalin స్టాలిన్ మంత్రివర్గంలో కీలక మార్పులు జరిగిన క్రమంలో సీఎం తన కేబినెట్ లోకి తన కుమారుడికి చోటు కల్పించారు.

ఉయదనిధి స్టాలిన్ డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గత ఎన్నికల్లో చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఉదయనిధి తొలిసారి ఎమ్మెల్యే అయ్యి పార్టీలో యువజన విభాగం కార్యదర్శిగా ఉన్నారు. గత కొద్దినెలలుగా సీనియర్ మంత్రులు, పలువురు పార్టీ నేతలు ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తమిళరాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ తన కుమారుడి క్యాబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. అనుకున్నట్లుగానే ఉదయనిధికి కేబినెట్ లో చోటు కల్పించారు. బుధవారం (డిసెంబర్‌ 14,2022) మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఉదియనిధి. వెనువెంటనే క్రీడాశాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాగా ఉదయనిధికి మంత్రిగా చోటు కల్పించడంపై అన్నాడీఎంకే పార్టీ విమర్శలు సంధించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిమాట్లాడుతూ డీఎంకే కుటుంబ పార్టీగా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. 2021 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడంతో స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో దాదాపు ఏడాదిన్న తరువాత క్యాబినెట్‌లో మార్పులు చేశారు. దీంట్లో భాగంగా కొంతమంది సీనియర్ నేతల సలహా మేరకు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని కేబినెట్ లోకి తీసుకున్నారు.

కాగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న దివంగత నేత..తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్-తిరువల్లికేనీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేసి విజయం సాధించారు. డీఎంకే స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.