స్విచ్ ఆఫ్..పిచ్చుకల కోసం 35 రోజులు చీకట్లోనే ఉన్న గ్రామం..అంథకారం కూడా అందంగా ఉందన్న గ్రామస్తులు

  • Published By: nagamani ,Published On : July 24, 2020 / 10:35 AM IST
స్విచ్ ఆఫ్..పిచ్చుకల కోసం 35 రోజులు చీకట్లోనే ఉన్న గ్రామం..అంథకారం కూడా అందంగా ఉందన్న గ్రామస్తులు

కిచకిచమంటూ కిటికీల మీద వాలే చిట్టి పిచ్చుకలు కనిపించకుండాపోతున్నాయి. అభివృద్ది పేరుతో మనిషి చేసే పనులకు చిట్టి పిట్ట పిచ్చుక అంతరించిపోతోంది. కానీ..అరుదైన పిచ్చుకలను రక్షించటానికి ఓ గ్రామం మొత్తం ఏకంగా 30 రోజుల పాటు చీకట్లోనే ఉండిపోయింది. ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచానికి ఆదర్శం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ గ్రామం ఎక్కడోకాదు మనదేశంలోనే తమిళనాడు శివగంగై జిల్లాలో ఉంది.

కరెంటు పోయిన ఐదు నిమిషాలైతే చాలా అబ్బా..ఈ కరెంట్ ఎప్పుడొస్తుందిరా బాబూ అనుకుంటూ సెకన్లు కూడా లెక్కబెట్టుకుంటు కూర్చుంటాం. కానీ అటువంటిదో ఓ ఊరు ఊరంతా పిచ్చుకల కోసం 35 రోజులుగా చీకట్లోనే ఉండిపోయింది.! ఆ ఊరి ప్రజలంతా పిచ్చుల సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం. అంతరించిపోయే దశకు చేరుకున్న ‘’ఇండియన్ రాబిన్’’ జాతికి చెందిన పిచ్చుకల రక్షణ కోసం ఈ విధంగా చేశారు.

పోతకుడి గ్రామంలో స్ట్రీట్ లైట్స్ స్విచ్ బోర్డులో ఇండియన్ రాబిన్ పిచ్చుక గూడు కట్టుకుంది. అందులో గుడ్లు పెట్టి పొదుగుతోంది. దీంతో వీధి దీపాల ఆన్ చేయాలి అంటే ఆడగూడును తీసివేయాలి. కానీ తొలగించాల్సి ఆ గూడు తీసివేయకూడదని గ్రామస్తులంతా కలిసి నిర్ధారించుకున్నారు. పిచ్చుల కోసం ఒకే మాటమీద నిలబడ్డారు.
ఆ పిచ్చుక గుడ్ల నుంచి పిల్లలు తయారై అవి ఎగిరిపోయేవరకూ స్విచ్ బోర్డు ముట్టుకోలేదు. దాదాపు 30 రోజుల తర్వాత పిల్లలు కావడంతో తర్వాత యదావిధిగా స్ట్రీట్ లైట్లు వేసుకుంటున్నారు. పిచ్చుకల రక్షణ కోసం ఆ గ్రామస్తులు చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా మారింది.

కాగా..గ్రామస్థులంతా ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం విద్యార్థి కారణం. లాక్ డౌన్ తో కాలేజీలన్నీ మూసివేయటంతో కరుపురాజా అనే 20 ఏళ్ల విద్యార్ధి సొంత ఊరు వచ్చాడు. అలా వచ్చిన రాజా తన ఇంటికి పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్స్ బోర్డు ఉండే బాక్సులో ఏదో ఉందని గమనించాడు. వెంటనే వెళ్లి పరిశీలించగా..ఆ బాక్సులో ఓ పిచ్చుగ పెట్టిన గూడు..ఆ గూడులో గుడ్లు కనిపించాయి. స్విచ్ వేయాలంటే ఆ గూడు తీసేయాలి.అలా తీస్తే ఆ పిచ్చుక గుడ్ల లోంచి పిల్లలు అయ్యే అవకాశం లేదు. దీంతో రాజా గ్రామ ప్రెసిడెంట్ కలీశ్వరికి ఈ విషయాన్ని చెప్పాడు. ఆ గూడు అరుదైన రాబిన్ జాతి పిచ్చుకలదని అవి అంతరించిపోయే దశలో ఉన్నాయని దయచేసి అవి పిల్లలయ్యేవరకూ వాటికి హాని జరకుండా చూడాలని కోరాడు.

దీనికి కలీశ్వరి కూడా అంగీకరించటం..గ్రామస్తులందరికి విషయాన్ని చెప్పటం..వాళ్లు కూడా సంతోషంగా ఒప్పుకోవటంతో అలా..35 రోజుల పాటు ఆ గ్రామం అంతా పిచ్చుకల కోసం చీకట్లోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని రాజా తన వాట్సాప్ లో మనస్సుని పిచ్చుల కోసం తన గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం షేర్ చేసాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని శివగంగై జిల్లాలోని పోతకుడి గ్రామస్థుల ఈ గొప్ప నిర్ణయానికి ప్రశంసలు అందుకుంటున్నారు.