అమ్మ పుట్టినరోజు : హాస్పిటల్లో శిశువులకు బంగారపు ఉంగరాలు బహుమానం

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 09:14 AM IST
అమ్మ పుట్టినరోజు : హాస్పిటల్లో శిశువులకు బంగారపు ఉంగరాలు బహుమానం

ఫిబ్రవరి 24 తమిళనాడు మాజీ సీఎం..దివంగత నేత అయిన జయలలితి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మంత్రి జయకుమార్ రాయపురంలోని రాజా సర్ రామస్వామిం ముదలియార్ హాస్పిటల్ (RSRM) సందర్శించారు. ఈరోజు అంటే జయలలిత పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 24న జన్మించిన ఏడుగురు శిశువులకు బంగారపు ఉంగాలను కానుకగా ఇచ్చారు.  

సామాన్యమనుషులకు ప్రయోజనం చేకూర్చేలా అమ్మ ఎంతో కృషి చేశారనీ..అటువంటి అమ్మ పుట్టిన రోజును రాష్ట్ర పిల్లలకు రక్షణ దినంగా జరుపుకుంటామని తెలిపారు. అమ్మ పుట్టిన రోజున బాలికల భద్రతా దినోత్సవాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా..ప్రభుత్వ స్కూల్స్ తో పాటు అన్ని కార్యాలయాల్లోను ప్రతిజ్ఞ చేయించారు. 

రాష్ట్ర బాలికల రక్షణ దినోత్సవం సందర్భంగా విరుగంపక్కంలోని కామరాజర్ రోడ్‌లోని సమాజ సంక్షేమ కేంద్రంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు డి జయకుమార్, వి. సరోజా, అధికారులు పాల్గొన్నారు. జయలలిత జన్మదినం సందర్భంగా సీఎం పళనిస్వామి చెన్నైలోని అఖిల భారత అన్నా ద్రవిడ మరున్నేట కజగం (AIADMK) కార్యాలయంలో జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు.