Tamilnadu : ఎస్సై గా సెలక్ట్ అయిన ట్రాన్స్ జెండర్

తమిళనాడులో పోలీసు డిపార్ట్ మెంట్ లో ఎస్సైగా పోస్ట్ సాధించారు ట్రాన్స్ జెండర్ శివన్య. సీఎం స్టాలిన్ చేతుల మీదుగా నియమాక పత్రం అందుకుని ఎంతోమంది ట్రాన్స్ జెండర్లకు స్ఫూర్తిగా నిలిచారు.

Tamilnadu  : ఎస్సై గా సెలక్ట్ అయిన ట్రాన్స్ జెండర్

New Project

transwoman sivanya gets her dream job as SI : ట్రాన్స్ జెండర్లు. సమాజం నుంచి వివక్షను భరిస్తునే చైతన్యంతో ఉద్యోగాలను సాధించుకుంటున్నారు. చదువు ద్వారానేసాధికారత లభిస్తుందని తెలుసుకుని చదువుకుని ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.డాక్టర్లు, పోలీసులుగా పేరు తెచ్చుకుంటున్నారు.అటువంటి మరో ట్రాన్స్ జెండర్ తమిళనాడులో పోలీసు డిపార్ట్ మెంట్ లో ఎస్సైగా పోస్ట్ సాధించుకున్నారు ట్రాన్స్ జెండర్ శివన్య. గతంలో ప్రీతిక యాసిని అనే ట్రాన్స్ జెండర్ తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సాధించగా, ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న శివన్య తిరువణ్ణామలైకి చెందిన 30 ఏళ్ల శివన్య కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది.కొన్నాళ్ల కిందట లింగ మార్పిడి చేయించుకున్న శివన్యకు పోలీసు ఉన్నతాధికారి అవ్వాలనేది కలను నెరవేర్చుకుంది. సీఎం ఎంకె స్టాలిన్ చేతుల మీదుగా శివన్య ఎస్ఐ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ పేపర్స్ అందుకుంది.

పోలీసు అధికారి కావాలనే తపనతో తమిళనాడు ప్రభుత్వ పోలీసు నియామక పరీక్షలకు హాజరైంది. ఫిజికల్ ఈవెంట్లలోనూ సత్తా చాటింది. తరువాత రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కూడా తనదైనశైలిలో శివన్య ప్రతిభ చూపింది. ఈ ప్రక్రియలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ వాటిని పట్టించుకుని బాధపడుతు కూర్చుంటే అనుకున్నది సాధించలేనని ఎప్పటికప్పుడు తనకు తాను ధైర్యం చెప్పుకున్నా..ఈటెల్లాంటి ఆ మాటల్ని మర్చిపోలేకపోయేది.ఏడ్చేది. ‘ నీకు పోలీస్ ఉద్యోగం కావాలా? చప్పట్లు చరిస్తూ అడుక్కుంటే కాసులు రాలతాయి..కష్టపడాలా ఏంటీ మీలాంటి వాళ్లు’ అంటూ అవమానాలు. వెక్కిరింపులు. కానీ అవేవీ శాశ్వతం కాదు తానుఅనుకున్నది సాధిస్తే తనను అవమానించిన నోళ్లే పొగుడుతాయని తనను తాను కౌన్సిలింగ్ చేసుకునేది. అన్నింటిలోను తన సమర్థతను నిరూపించుకున్న ఈ ట్రాన్స్ జెండర్ ఎస్ఐగా ఎంపికై సాక్షాత్తూ సీఎం స్టాలిన్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకుంది.

కానీ తన కల అంత వరకే కాదని డీఎస్పీ అవ్వానలని కోరికను బయటపెట్టింది శివన్య. ఎప్పటికైనా నాఈ కలను సాధించుకుంటానని ధీమాగా చెబుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినదాన్ని..డీఎస్పీ అవ్వటానికి నా కష్టం సరిపోదా?అంటోంది.తన ఈ కల నెరవేర్చుకోవటంలో తనకుటుంబం ఎంతగానో ప్రోత్సహించిందనీ..ట్రాన్స్ జెండర్ అయినా చాలామంది ట్రాన్స్ జెండర్ల వలనె తనను తన కుటుంబ ఏనాడు చులకనగా చూడలేదని తెలిపింది. శివన్య సోదరుడు తమిళనిధి పోలీసు డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నాడు. మరో సోదరుడు పోలీసు ఉద్యోగానికిప్రిపేర్ అవుతున్నాడని తెలిపింది.మొత్తానికి శివన్య కుటుంబం అంతా పోలీసు డిపార్ట్ మెంట్ కే అంకితమైనట్లుంది. ఏది ఏమైనా వివక్షలను అధిగమించి ఎస్సైగా సెలెక్ట్ అయిన శివన్య ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.