కైలాస దేశంలో హోటల్ పెడతా..నిత్యానందను రిక్వెస్ట్ చేసిన తమిళ తంబి

  • Published By: madhu ,Published On : August 24, 2020 / 09:12 AM IST
కైలాస దేశంలో హోటల్ పెడతా..నిత్యానందను రిక్వెస్ట్ చేసిన తమిళ తంబి

Nityananda

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ప్రకటించుకున్న సొంత దేశంలో ఓ హోటల్ పెడుతానని ఇందుకు అనుమతినివ్వాలంటున్నాడు ఓ తమిళ తంబి. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



కుమార్..వ్యాపారి..తమిళ వాసి. మధురైలోని టెంపుల్ సిటీ అనే పేరిట హోటళ్లను నిర్వహిస్తున్నాడు. అంతేగాకుండా…మధురై జిల్లా హోటల్ యజమానుల సంఘానికి అధ్యక్షుడి గా ఉన్నారు. కైలాస దేశంలో కూడా ఓ హోటల్ పెట్టాలని భావించాడు.

అక్కడ వ్యాపారం చేసుకొనేందుకు అనుమతినివ్వాలంటూ నిత్యానందను కోరడం చర్చనీయాంశమైంది. అక్కడకు వస్తున్న భక్తులకు, గెస్ట్ లకు వారికి నచ్చే విధంగా ఫుడ్ అందిస్తానని, వచ్చిన డబ్బుతో ఆ దేశం అభివృద్ధికి తోడ్పాడుతానంటున్నాడు.



నిత్యానంద కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారనేది తెలిసిందే. తిరువన్నమలైకి చెందిన ఇతనిపై కిడ్నాప్, హత్య, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వామి నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్లో. శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్‌ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదైంది.

వరుస కేసుల క్రమంలో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు. కిడ్నాప్‌ కేసులో గుజరాత్‌ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్‌) సాయం కోరారు. అయినప్పటికీ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు.



ఓ ప్రాంతానికి వెళ్లి..తనది సొంత కైలాశ దేశంగా ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన యూ ట్యూబ్ ద్వారా వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. వినాయక చవితి నాడు..ఆ దేశ కరెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. హిందూ దేశాలతో తాను వ్యాపారం చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన వ్యాపారి రాసిన లేఖకు నిత్యానంద స్వామి జవాబిస్తారా ? లేదా ? అనేది వెయిట్ అండ్ సీ.