ఎంజాయ్ : సంక్రాంతి పండక్కి రూ.వెయ్యి క్యాష్ గిఫ్ట్

తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వనున్నట్టు తమిళనాడు గవర్నర్ బనర్విలాల్ పురోహిట్ ప్రకటించారు.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 10:18 AM IST
ఎంజాయ్ : సంక్రాంతి పండక్కి రూ.వెయ్యి క్యాష్ గిఫ్ట్

తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వనున్నట్టు తమిళనాడు గవర్నర్ బనర్విలాల్ పురోహిట్ ప్రకటించారు.

  • రేషన్ కార్డుదారులకే ఈ సదుపాయం వర్తింపు.. 

  • ఒక్కో కుటుంబానికి రూ.1000, గిఫ్ట్ హ్యాంపర్లు 

 చెన్నై: తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 తో పాటు గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ బనర్విలాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమిళ ప్రజలకు పొంగల్ ఫెస్టివల్ కానుక అందించడం సంతోషకరమైన విషయమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.1000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్టు ప్రకటించారు. తిరువురు జిల్లా మినహా రాష్ట్రమంతటా ప్రభుత్వం అందించే ఆఫర్ వర్తిస్తుందని బనర్విలాల్ తెలిపారు. రాబోయో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు పథకాల ప్రకటనపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. 

తిరువూరు మినహా.. 
తిరువూరులో ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఆ ఒక్క జిల్లాను మాత్రం మినహాయించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం అందించే గిఫ్ట్ హ్యాంపర్లలో బియ్యం, షుగర్, కిస్‌మిస్‌, జీడిమామిడి గింజలు, యాలకులు, చెరకు ఉంటాయన్నారు. గజ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన కావేరి డెల్టా సహా ఇతర ఉత్తర కోస్తా జిల్లా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని బనర్విలాల్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో దాదాపు రెండు కోట్ల మంది రేషన్ కార్డుదారులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు.