MK Stalin : కాన్వాయ్ ఆపి పెద్దావిడ వినతి పత్రం తీసుకున్న సీఎం స్టాలిన్

తమిళనాడులో అధికారం చేపట్టినాటినుంచి సీఎం స్టాలిన్ తనదైన స్టైల్‌లో దూసుకు వెళుతున్నారు.

MK Stalin : కాన్వాయ్ ఆపి పెద్దావిడ వినతి పత్రం తీసుకున్న సీఎం స్టాలిన్

Tamilnadu Mk Stalin Stopped His Convoy During His Recent Visit In Salem District

MK Stalin :  తమిళనాడులో అధికారం చేపట్టినాటినుంచి సీఎం స్టాలిన్ తనదైన స్టైల్‌లో దూసుకు వెళుతున్నారు. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు స్ధానం కల్పించి విమర్శకుల చేత ప్రశంసలు పొందారు. దివంగత నేత జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను అదేపేరుతో నిర్వహిస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరో సంఘటనలో ఒక వృధ్ద మహిళ వద్దనుంచి వినతి పత్రం తీసుకుని దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం సేలం, తిరుచ్చి జిల్లాల్లో పర్యటించారు. తిరుచ్చి వేళ్లే దారిలో ఒక గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ స్టాలిన్ కాన్వాయ్ నెమ్మదిగా వెళుతోంది. ఆ సమయంలో ఒక వృధ్ధ మహిళ వినతిపత్రం తో స్టాలిన్ కోసం ఎదురు చూస్తూ రోడ్డుపై నిలబడి ఉంది. సీఎం వాహానం చూసిన మహిళ కొంచెం ముందుకు వెళ్లి వినతి పత్రాన్ని సీఎంకు చూపిస్తూ చేతులు ఊపింది.

అది గమనించిన స్టాలిన్ తన వాహనాన్ని ఆపి, ఆమె వద్ద వినతి పత్రం తీసుకున్నారు. ఆమె చెప్పినదంతా విని .. పిటీషన్ పై సంతకం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రే స్వయంగా తన విజ్ఞప్తిని తీసుకుని అధికారులను ఆదేశించటంతో ఆ పెద్దావిడ ఆనందంలో మునిగిపోయింది. ఈవీడియో తమిళనాడులో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం హోదాలో ఉన్నా సామాన్యుల గురించి పట్టించుకుంటూ సమస్యలు పరిష్కరించటం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.