Tamilnadu : దెయ్యం పట్టిందని ఏడేళ్ల కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపిన తల్లి..

కన్నతల్లే కొడుకుని కిరాతకంగా చంపేసింది.దెయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో చిన్నపిల్లాడిని చిత్రహింసలు పెట్టి మరీ చంపేసిన దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా ...అరనిలో కొడుకుకి దెయ్యం పట్టిందని కొట్టి చంపింది కన్నతల్లి. ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి చంపారని పోలీసులు తెలిపారు.

10TV Telugu News

Mother kills his 7 years son : తమిళనాడులో దారుణం జరిగింది. కన్నతల్లే కొడుకుని కిరాతకంగా చంపేసింది.దెయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో చిన్నపిల్లాడిని చిత్రహింసలు పెట్టి మరీ చంపేసిన దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా …అరనిలో కొడుకుకి దెయ్యం పట్టిందని కొట్టి చంపింది కన్నతల్లి. ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి చంపారని పోలీసులు తెలిపారు.

ఓ తల్లి ఇద్దరు మహిళలతో కలిసి ఏడు సంవత్సరాల పిల్లాడిని చిత్రహింసలు పెడుతున్నారని కన్నమంగళం స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకునేసరికి బాలుడు మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లితో సహా ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. కొడుకుకి దెయ్యం పట్టిందని అందుకే పూజలు చేస్తున్నామని ఈ క్రమంలోనే పిల్లాడు చనిపోయాడని తాపీగా చెప్పింది కన్నతల్లి.

మరోవైపు కన్నతల్లి సపర్యమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని డబ్బుల కోసమే ఇదంతా జరిగి వుంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. మరో ఇద్దరు మహిళలు ఆమెను మాయ మాటలతో మోసం చేసి పిల్లాడిని చంపేలా చేశారని తల్లికి మతిస్థిమితం సరిగా లేదని ఆమెను మోసం చేసి ఇలా చేయించారంటున్నారు బంధువులు.

ఏది ఏమైనా మూఢవిశ్వాసంతో ఏడు సంవత్సరాల బాలుడికి ఊపిరి ఆడకుండా చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తల్లిని నిజంగా మతిస్థిమితం లేదా? లేదా…తల్లితో పాటు పిల్లాడిని హింసించిన మరో ఇద్దరు మహిళలు ఎవరు? ఎందుకిలాచేశారని కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

×