Skeletons Mystery : ‘యాస్’ తుఫాను గాలుల ధాటికి..ఇసుకలోంచి బైటపడ్డ ఐదు అస్థిపంజరాలు

‘యాస్’ తుఫాను ఐదు అస్థిపంజరాలను మిస్టరీని బయటపెట్టింది.తమిళనాడులోని ఓ గ్రామంలో సముద్రతీరంలో ఇసుకలో పాతిపెట్టబడిన ఐదు అస్థిపంజరాలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటిని మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు.

10TV Telugu News

Five skeletons mystery: పలు రాష్ట్రాలకు అల్లాడించిన ‘యాస్’ తుఫాను ఐదు అస్థిపంజరాలను మిస్టరీని బయటపెట్టింది. సముద్రతీరంలో ఇసుకలో పాతిపెట్టబడిన ఐదు అస్థిపంజరాలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. యాస్ తుఫాను ప్రభావంతో గాలులు అత్యంత తీవ్రంగా తమిళనాడులోని రామనాథపు,రం జిల్లాలోని వలినొక్కం గ్రామం సమీపంలో పాతిపెట్టిన అస్థిపంజరాలు బైటపడ్డాయి. యాస్ ప్రభావంతో రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు గాలల ప్రతాపానికి కొట్టుకుపోయి..ఐదు అస్థిపంజరాలు )బయటపెట్టాయి. దీంతో స్థానికులే కాదు పోలీసు యంత్రాంగం మొత్తం షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి? ఇక్కడకు ఎలా ఇక్కడకు వచ్చాయి? ఎవరన్నా చంపి ఇక్కడ పాతిపెట్టారా? లేదా వీరివి సాధారణ మరణాలేనా? సాధారణ మరణాలైతే ఇలా ఒకేచోట ఐదుగురుని ఎలా పాతిపెడతారు? అనే పలు ప్రశ్నలు పోలీసులు పెద్ద సవాలుగా మారాయి. ఈ ప్రశ్నల్ని ఛేదించే పనిలో పడ్డారు తమిళనాడు పోలీసులు.

వలివొక్కం గ్రామంలో అస్థపంజరాల మిస్టరీ..
అది రామనాథపురం జిల్లాలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న వలినొక్కం అనే గ్రామం. ఈ గ్రామంలో పలు మత్స్యకార కుటుంబాలకు చెందిన 500 మంది నివసిస్తున్నారు. యాస్ తుఫాను వల్ల చేపల వేటకు వెళ్లే పనిలేకుండా పోయిన మత్స్యకారులు..ఎప్పుడెప్పుడు చేపల వేటకు వెళ్లి కాస్తంత బువ్వ తిందామని ఆశగా ఎదురు చూస్తున్నారు. తుఫాను ప్రభావంతో తీవ్ర గాలకు పాడైపోయిన బోట్లను..వలలను..ఇళ్లను బాగుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లకు సముద్రతీరంలో శనివారం (మే ఒక అస్థి పంజరం కనిపించింది. తుఫాను గాలలుకు ఇసుక రేణువులు కొట్టుకుపోవటంతో అది బైటపడినట్లుగా కనిపిస్తోంది అది ఉన్న తీరునుబట్టి. అలా వాళ్లు పరిశీలించగా..వరుసగా ఒకదాని తరువాత మరొకటిగా ఐదు అస్థిపంజరాలు వారి కళ్లబడ్డాయి. అంతే వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పరిసరాలను పరిశీలించారు. తీవ్ర గాలులకు ఇసుక కొట్టుకుపోయి అవి బైటపడినట్లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని సముద్ర తీరంలో వెలుగు చూసి ఐదు మృతదేహాలు ఎవరివి? ఎప్పుడు పాతిపెట్టబడినవి? ఇవి హత్యలేనా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా..ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా కనిపించకుండాపోయారా? అనే దిశగా ఆరా తీస్తున్నారు. పలు స్టేషన్లలు మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? అని పరిశీలిస్తున్నారు.

పాత మిస్సింగ్‌ కేసుల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్‌, డీఎన్‌ఏ ల్యాబ్‌లకు పంపించి..దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పలు కేసుల్లో దోషులుగా ఉన్నవారిపైనా.. సైకో కిల్లర్ల్స్‌ పైనా నిఘా వేశారు. వారి కదలికలను నిత్యం కనిపెడుతున్నారు. కానీ ఇన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా..పోలీసులకు బలమైన ఆధారాలేవీ లభించలేదు. ఈ అస్థిపంజరాల మిస్టరీ కేసును పోలీసులు సవాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అస్థిపంజాల కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని తమిళనాడు ప్రభుత్వం పోలీసు శాఖకు ఆదేశాలు జారిచేసింది.

10TV Telugu News