Food Delivery Agent: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చెంపదెబ్బ కొట్టిన పోలీస్ ట్రాన్సఫర్

బిజీ రోడ్లపై అందరూ చూస్తుండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై చేయి చేసుకుని, చెంప దెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్సఫర్ అయ్యారు. శనివారం ఈ నిర్ణయం తీసుకుని కొయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూంకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ట్రాన్సఫర్ చేశారు.

Food Delivery Agent: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చెంపదెబ్బ కొట్టిన పోలీస్ ట్రాన్సఫర్

Food Delivery Agent

 

 

Food Delivery Agent: బిజీ రోడ్లపై అందరూ చూస్తుండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై చేయి చేసుకుని, చెంప దెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్సఫర్ అయ్యారు. శనివారం ఈ నిర్ణయం తీసుకుని కొయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూంకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ట్రాన్సఫర్ చేశారు.

గ్రేడ్-1 కానిస్టేబుల్ సింగనల్లూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సతీశ్ అవినాశి రోడ్ లోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద డెలివరీ పర్సన్ ను చెంపదెబ్బ కొట్టాడు. సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగి యాక్షన్ తీసుకున్నారు. కానిస్టేబుల్ ను వెంటనే కంట్రోల్ రూంకు ట్రాన్సఫర్ చేశారు.

ఫుడ్ అగ్రిగ్రేటర్ అయిన స్విగ్గీలో మోహన సుందరం (38) రెండేళ్లుగా డెలివరీ పార్టనర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ ర్యాష్ గానూ, నిర్లక్ష్యపూరితంగానూ డైవ్ చేసుకుంటూ వస్తున్నట్లు గమనించాడు. కాస్తలో ఆ బస్సు ఇద్దరు టూవీలర్స్ ను, పాదచారుడిని ఢీకొట్టబోయింది.

Read Also: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్

డ్రైవర్ ను నిలదీయబోయేసరికి ట్రాఫిక్ జామ్ కారణంగా ఇలా జరిగిందని వివరణ ఇచ్చాడు. పోలీస్ ఫుడ్ డెలివరీ వ్యక్తిని తిడుతూ.. చెంపదెబ్బ కొట్టాడు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. మోటార్ సైకిల్ ను కూడా డ్యామేజ్ చేశాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

స్కూల్ బస్సు యజమాని ఎవరో తెలుసా అని, వాహనాల రాకపోకల సమస్య తలెత్తితే పోలీసులు చూసుకుంటారని, నీకెందుకంటూ ప్రశ్నించారు సతీష్. మోహనసుందరం శనివారం నగర పోలీసు కమిషనర్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో అధికారులు సతీష్‌ను కంట్రోల్‌ రూమ్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.