దేవుడికి మాటిచ్చా : గవర్నమెంట్ జాబ్ వస్తే చచ్చిపోతానని మొక్కు..!!

  • Published By: nagamani ,Published On : November 2, 2020 / 11:21 AM IST
దేవుడికి మాటిచ్చా : గవర్నమెంట్ జాబ్ వస్తే చచ్చిపోతానని మొక్కు..!!

Tamilnadi : ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తారు ఎవరైనా సరే. చక్కగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చనుకుంటారు. కానీ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని జిల్లాలోని నాగర్‌కోయిల్ కు చెందిన ఓ యువకుడు మాత్రం ‘‘గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఆత్మహత్య’’కు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువకుడు రాసిన లెటర్ లోని విషయాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.


‘‘నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే దేవుడి దగ్గరకు వస్తానని మొక్కుకున్నాను.అందుకే దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా’’అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన పోలీసుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.



https://10tv.in/tamilnadu-thief-leaves-note-of-apology-for-madurai-shopkeeper-after-stealing-goods-worth-rs/
వివరాల్లోకి వెళితే కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన నవీన్ అనే 32 ఏళ్ల యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేలేకపోతున్నానని ఎంతో మధనపడిపోయేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదని నిరాశకు గురయ్యాడు. ఈక్రమంలో ఒక మనిషిగా నా ప్రయత్నాలన్నీ చేశాను..ఇక దేవుడిదే భారం అనుకున్నాడు. అలా ‘‘దేవుడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించు..అలా జరిగితే నేను నీ నా జీవితాన్ని త్యాగం చేస్తాను..నీ పాదపద్మలా చెంతకు వచ్చేస్తాను’’అని మొక్కుకున్నాడు.


అలా మొక్కుకున్న నవీన్ కు కొన్ని రోజులకే ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం దొరికింది. వెంటనే అతను ముంబై వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. 15 రోజుల పాటు చక్కగా ఉద్యోగం కూడా చేశాడు. తరువాత రైలులో త్రివేండ్రం బయలుదేరాడు.


మధ్యలో ఒక స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు నవీన్ మృతదేహం వద్ద లభించిన ఓ సూసైడ్ నోట్ చూశారు. దాన్ని చదివిన వారు ఆశ్చర్యపోయారు. ఆ లెటర్ లో ‘‘భగవంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని..తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే భగవంతుని దగ్గరకు వచ్చేస్తానని వేడుకున్నానని అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసాడు.


నవీన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంనకు తరలించారు. అయితే పోలీసులు ఈ ఉదంతంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నవీన్ ఆత్మహత్యకు వేరే కారణాలేవైనా ఉంటాయన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అతని సన్నిహితుల దగ్గరి నుంచి వివిధ వివరాలను తెలుసుకుంటున్నారు.