భారత రైల్వే పట్టాలపై ప్రైవేట్ రైళ్లు: క్యూ కట్టిన Tata, Hyundai, Adani కంపెనీలు

భారత రైల్వే పట్టాలపై ప్రైవేట్ రైళ్లు: క్యూ కట్టిన Tata, Hyundai, Adani కంపెనీలు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ 2020 ప్రకటించిన సమయంలో ఇండియన్ రైల్వేస్‌లో ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు అంతా సెట్టి అయిపోయిందన్నారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్ లాంటి సర్వీసులు మరిన్ని పెంచి టూరిస్ట్ ప్రదేశాలకు ప్రయాణికులను చేర్చడమే టార్గెట్. ఈ మెగా ప్లాన్‌లో భాగంగానే 100 ప్రైవేట్ రూట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా నడపడంతో పాటు, లోకల్ సర్వీసులలోనూ ప్రైవేట్ కంపెనీలు అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 

వీటి కోసం పోటీపడుతున్న వాటిలో అల్‌స్టామ్ ట్రాన్స్‌పోర్ట్, బంబార్డియర్, సీమెన్స్ ఏజీ, హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ, మాక్వారీలు ఉన్నాయి. అంతే కాకుండా టాటా రియల్టి అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హిటాచీ ఇండియా అండ్ సౌతాసియా, ఎస్సెల్ గ్రూప్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)లు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

1) భారతదేశంలో 150 ప్రైవేట్ ట్రైన్ల కోసం 100రూట్ల జాబితా సిద్ధం చేశారు. ఈ 100రూట్లు 10-12క్లస్టర్లుగా విడగొట్టనున్నారు. 
2) ముంబై-న్యూ ఢిల్లీ, చెన్నై-న్యూ ఢిల్లీ, న్యూ ఢిల్లీ-హౌరా, షాలిమార్-పూణె, న్యూ ఢిల్లీ-పాట్నా లాంటి రూట్లలో ప్రైవేట్ రైళ్లు తిరుగుతాయి. 
3) ఇతర ట్రైన్లు తిరిగే రూట్లలో పదిహేను నిమిషాల ముందే ప్రైవేట్ ట్రైన్లు తిరగనున్నాయి. ఒకేసారి ప్రైవేట్, ప్రభుత్వ రైళ్లు తిరిగే అవకాశమే లేదని ప్రకటనలో వెల్లడించారు. 
4) ప్రతి కొత్త ట్రైన్‌కు కనీసం 16కోచ్‌లు ఉంటాయి. దాదాపు లాంగెస్ట్ ప్యాసింజర్ ట్రైన్‌కు మించి భోగీలు ఉండవు. వీటి వేగం గంటకు 160కిలోమీటర్లకు మించకుండా ఉంటుంది. 
5) ప్రైవేట్  సర్వీసులే ఆ రూట్‌కు ఫీజును నిర్ణయిస్తాయి. ఆ రైళ్ల పూర్తి బాధ్యత వారిపైనే ఆధారపడి ఉటుంది. 

దీని కోసమే బడ్జెట్ 2020లో రూ.12వేల కోట్లు కేటాయించి కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందులో కేవలం సిగ్నలింగ్, టెలికామ్ కోసమే రూ.వెయ్యి 650కోట్లు కేటాయించారు.