Tata-Airbus: హైదరాబాద్‌లో రూ.22వేల కోట్ల ఖర్చుతో మిలటరీ విమానం తయారీ

అతి పెద్ద మిలటరీ ఆర్డర్‌ను ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీకి  అప్పగించనున్నారు. ఎయిర్‌ఫోర్స్ కోసం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారుచేసే అవకాశం దక్కించుకోనుంది.

Tata-Airbus: హైదరాబాద్‌లో రూ.22వేల కోట్ల ఖర్చుతో మిలటరీ విమానం తయారీ

Aircraft For Tata Air Bus

Tata-Airbus: అతి పెద్ద మిలటరీ ఆర్డర్‌ను ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీకి  అప్పగించనున్నారు. ఎయిర్‌ఫోర్స్ కోసం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారుచేసే అవకాశం దక్కించుకోనుంది. ఈ మేర గురువారం నాటికి మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గురించి కన్ఫామ్ చేసి సంతకం చేయనున్నారు. డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ లో ప్రైవేట్ సెక్టార్ ను ప్రోత్సహించేందుకు గానూ.. దాదాపు రూ.22వేల కోట్లు వెచ్చించనున్నారు.

ఈ భారీ డీల్‌కు Tata – Airbus గురువారం సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు వారాల తర్వాత సెక్యూరిటీ విషయంపై జరిగే క్యాబినెట్ కమిటీలో దీనిని ప్రవేశపెడతారు. డిఫెన్స్ మినిష్ట్రీతో పాటు టాటా, ఎయిర్‌బస్ కు చెందిన ఉన్నతస్థాయి అధికారులు ఇందులో పాల్గొంటారు.

ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని చర్చిస్తారు. స్థానికంగా తయారుచేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అధికారులు. హైదరాబాద్, బెంగళూరు పరిసర ప్రాంతాలు ఈ నిర్మాణానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు.

 

……………………………….Oppo A16: ఒప్పో ఏ 16 మార్కెట్లోకి వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లతో