N Chandrasekaran: రూ.98 కోట్లతో విలాసవంతమైన డూప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేసిన టాటా సన్స్ చైర్మన్

ఒక లగ్జరీ డూప్లెక్స్ కోసం దాదాపు రూ.100 కోట్లు కేటాయించడం ఇటీవల కాలంలో ముంబై మహానగరంలో ఇదే మొదటిసారని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి.

N Chandrasekaran: రూ.98 కోట్లతో విలాసవంతమైన డూప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేసిన టాటా సన్స్ చైర్మన్

Chandra

N Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ రూ.98 కోట్లతో విలాసవంతమైన డుప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేశారు. ముంబైలోని పెద్దార్ రోడ్డులో ఓ లగ్జరీ అపార్టుమెంటులో తన కుటుంబం కోసం ఎన్.చంద్రశేఖరన్ ఇల్లును కొనుగోలు చేసినట్లు టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. 28-అంతస్తుల ఆకాశహర్మ్యంలో దక్షిణ ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ సమీపంలో ఉన్నతవర్గాలు నివసించే నివాస సముదాయంలో ఈ ఇల్లును కొనుగోలు చేశారు చంద్రశేఖరన్. అయితే ఒక లగ్జరీ డూప్లెక్స్ కోసం దాదాపు రూ.100 కోట్లు కేటాయించడం ఇటీవల కాలంలో ముంబై మహానగరంలో ఇదే మొదటిసారని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. 6000 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గి ఉన్న ఈ సువిశాలమైన అపార్టుమెంటులో 11వ మరియు 12వ అంతస్తులలో ఎన్.చంద్రశేఖరన్ తన కుటుంబంతో సహా నివసిస్తున్నారు.

Also read:Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

2017 ఫిబ్రవరి 21న టాటా గ్రూప్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి అంటే గత ఐదేళ్లుగా చంద్రశేఖరన్ ఇదే అపార్టుమెంటులో నివాసముంటున్నారు. అయితే ఇప్పటివరకు నెలవారీ అద్దె రూ. 20 లక్షలకు గానూ ఇక్కడ నివసించిన చంద్రశేఖరన్..మరో ఐదేళ్ల పాటు టాటా గ్రూప్ చైర్మన్ గా కొనసాగనున్న నేపథ్యంలో అదే ఇంటిని కొనుగోలు చేసినట్లు టాటా సంస్థ ప్రతినిధి చెప్పుకొచ్చారు. 2027 ఫిబ్రవరి వరకు ఎన్.చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ గా కొనసాగనున్నారు.

Also Read:Twitter Deal Row: ట్విట్టర్ డీల్ వెనుక ట్రంప్ ఉన్నాడా?: ఎలాన్ మస్క్ ఏమన్నారంటే!

చంద్రశేఖరన్ (58), ఆయన సతీమణి లలిత, కుమారుడు ప్రణవ్ పేరిట మూడు రోజుల క్రితమే ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. చదరపు అడుగుకు రూ. 1.6 లక్ష వెచ్చించి ఈ లావాదేవీ జరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దారుడు జీవేష్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, బిల్డర్ సమీర్ భోజ్వానీ ఈ టవర్‌ను 2008లో నిర్మించారు. టాటా సన్స్ చైర్మన్ గా 2021 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ.91 కోట్ల మూలవేతనం తీసుకున్న ఎన్.చంద్రశేఖరన్ దేశంలోనే అత్యంత వేతనం తీసుకున్న కార్పొరేట్ లీడర్ గా నిలిచారు.

Also read:Next Pandemic: వాతావరణ మార్పులతో జంతువులు వైరస్ వ్యాప్తి పెరిగేందుకు కారణమవుతున్నాయా?