TATA : బడా వ్యాపారాలపై TATA ఫోకస్.. పలు కంపెనీల్లో భారీ పెట్టుబడులు..

టాటా గ్రూప్.. భారత పారిశ్రామిక రంగంలో తిరుగులేని సంస్థ. అలాంటి.. టాటా అన్ని రంగాల్లోని వ్యాపారాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ-కామర్స్, ఈ-ఫార్మసీతో పాటు అనేక రంగాల్లో ఉన్న వ్యాపారాల్లో తన ముద్ర వేయాలని చూస్తోంది. ఇందుకోసం.. ఇప్పటికే అందులో సెట్ అయి.. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టి.. మెజారిటీ వాటాలను దక్కించుకుంటోంది. అలా.. గడిచిన కొన్నేళ్లలోనే.. టాటా గ్రూప్ మంచి మంచి కంపెనీలను టేకోవర్ చేసింది.

TATA : బడా వ్యాపారాలపై TATA ఫోకస్.. పలు కంపెనీల్లో భారీ పెట్టుబడులు..

TATA Consumer Products..Ramesh Chauhan in discussions for Sale Of Bisleri

TATA : టాటా గ్రూప్.. భారత పారిశ్రామిక రంగంలో తిరుగులేని సంస్థ. అలాంటి.. టాటా అన్ని రంగాల్లోని వ్యాపారాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ-కామర్స్, ఈ-ఫార్మసీతో పాటు అనేక రంగాల్లో ఉన్న వ్యాపారాల్లో తన ముద్ర వేయాలని చూస్తోంది. ఇందుకోసం.. ఇప్పటికే అందులో సెట్ అయి.. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టి.. మెజారిటీ వాటాలను దక్కించుకుంటోంది. అలా.. గడిచిన కొన్నేళ్లలోనే.. టాటా గ్రూప్ మంచి మంచి కంపెనీలను టేకోవర్ చేసింది.

ఇప్పటికే ఎయిరిండియాను కొనేసిన టాటా ఇప్పుడు బిస్లెరీని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎయిరిండియా మాత్రమే కాదు.. గతేడాది ఆన్‌లైన్‌లో గ్రాసరీ సేల్స్‌కి సంబంధించిన బిగ్‌బాస్కెట్‌లో.. మెజారిటీ వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో.. ఈ-కామర్స్‌లో పెద్ద సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, జియోమార్ట్ లాంటి సంస్థలతో.. టాటా గ్రూప్ పోటీకి దిగింది. టాటా సన్స్.. సొంత సంస్థ అయిన టాటా డిజిటల్ ద్వారా బిగ్ బాస్కెట్‌ను టేకోవర్ చేసింది. కోవిడ్ తర్వాత ఆన్ లైన్ షాపింగ్ ఊపందుకోవడంతో.. టాటా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ స్థాయిలో.. ఆన్‌లైన్ గ్రాసరీ బిజినెస్‌ కోసం డిజిటల్ వ్యవస్థను రూపొందించాలనుకున్న తమ లక్ష్యానికి.. బిగ్ బాస్కెట్ టేకోవర్ అనుగుణంగా ఉందని.. టాటా గ్రూప్ అప్పుడు తెలిపింది. 2011లో బెంగళూరులో ప్రారంభించిన బిగ్ బాస్కెట్.. ప్రస్తుతం 25 నగరాల్లో అందుబాటులో ఉంది. కాగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం క్యూమిన్, లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం టాటా క్లిక్, ఎలక్ట్రానిక్స్ స్టోర్ క్రోమా లాంటి.. వివిధ కన్జూమర్ బిజినెస్‌లన్నింటిని ఒకే గొడుగు కిందకు తెస్తూ.. టాటా న్యూ సూపర్‌ యాప్‌ను తెచ్చింది. ఇంట్లో కావల్సిన సరుకుల నుంచి విమాన టికెట్ల దాకా అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

ఇక.. ఈ-ఫార్మసీ, ఈ-హెల్త్ సెక్టార్లలో దూసుకుపోతున్న 1ఎంజీ సంస్థలోనూ.. టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టింది. 1ఎంజీ సంస్థలో.. 5 వేల 4 వందల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ప్రస్తుతం.. దేశంలో 20 వేలకు పైగా పిన్‌కోడ్‌లకు 1ఎంజీ సంస్థ మెడిసిన్స్ డెలివరీ చేస్తోంది. టాటా డిజిటల్ చేరికతో.. ఈ సేవలు మరింత విస్తరించాయ్. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో చూస్తే.. టాటా గ్రూప్ టాప్‌లో కనిపిస్తుంది. ఆ రంగంలో ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటాలు.. ఇప్పుడు ఈ-కామర్స్‌పై ఫోకస్ పెట్టారు. ఈ రంగంలో వృద్ధిరేటును గమనించి.. టాటా డిజిటల్‌ని ముందుంచి.. వరుసగా పెట్టబుడులు పెడుతూ.. మెజారిటీ వాటాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

TATA BISLERI : దూకుడుమీదున్న TATA .. బిస్లెరీ కొనుగోలుకు రంగం సిద్ధం

ఇక.. లేటెస్ట్ అప్‌డేట్ మరొకటుంది. టాటా గ్రూప్ దేశవ్యాప్తంగా 20 బ్యూటీ టెక్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ ప్రీమియం కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. కార్ మేకర్ నుంచి.. జ్యువెలరీ దాకా విస్తరించిన టాటాలు.. బ్యూటీ టెక్ రంగంలోనూ.. తమ మార్క్ చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో.. దేశీయ దిగ్గజం నైకా సహా రిలయన్స్ సెంట్రోకు గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. భారత్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అందువల్ల.. ఎక్కువగా ఫారెన్ బ్రాండ్లను యువతకు పరిచయం చేయాలని.. టాటాలు భావిస్తున్నారు. ప్రస్తుతం 20కి పైగా ఫారెన్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.

ఇక.. 2008లో అమెరికన్ మల్టీనేషనల్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్ అయిన ఫోర్డ్ కంపెనీ నుంచి.. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ని టేకోవర్ చేసింది టాటా గ్రూప్. ఈ డీల్ విలువ.. 230 కోట్ల డాలర్లు. ఈ ఒక్క డీల్‌తో.. టాటా గ్రూప్ లెవెల్ ఏంటో.. ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడంటే.. ఇండియాలోని కంపెనీలను టేకోవర్ చేస్తున్నారు గానీ.. 2008లోనే ఓ మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీని.. అది కూడా ఫోర్డ్ లాంటి బ్రాండ్‌ని.. పూర్తిగా కొనేశారంటే.. టాటా గ్రూప్ బిజినెస్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లు.. ఇప్పుడు భారత కంపెనీకి చెందినవని.. గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు రతన్ టాటా.

Bisleri International: వ్యాపారాన్ని చూసుకోవడానికి కూతురు అయిష్టత.. బిస్లెరీని అమ్మకానికి పెట్టిన రమేశ్ చౌహాన్

టెక్నాలజీలో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, స్టీల్‌లో.. టాటా స్టీల్, ఆటోమొబైల్స్‌లో.. టాటా మోటార్స్, కన్జూమర్ అండ్ రిటైల్‌లో.. టాటా కెమికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో.. టాటా పవర్, టూరిజం అండ్ హోటల్స్‌లో.. ఇండియన్ హోటల్స్, స్టార్‌బక్స్‌, వీటికి తోడు ఎయిరిండియా, ఎయిర్ ఏసియా, విస్తారా, బిగ్ బాస్కెట్, జాగ్వార్ అండ్ లాండ్ రోవర్, 1ఎంజీ, టాటా డిజిటల్, టాటా కన్జూమర్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా 30 కంపెనీల దాకా టాటా గ్రూప్‌లో ఉన్నాయ్. అంతేకాదు.. వ్యాపార ప్రపంచంలో.. బిజినెస్ విస్తరించేందుకు.. ఇలాగే దూకుడుగా ముందుకు వెళితే.. టాటా గ్రూప్‌లో మరిన్ని కంపెనీలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఉప్పు నుంచి విమాన టికెట్ల దాకా ఇప్పటికే అన్ని రకాల సాంప్రదాయ వ్యాపారాల్లోకి ప్రవేశించిన టాటాలు.. నవతరం నుంచి డిమాండ్ ఉన్న రంగాల్లోనూ తమ పట్టు పెంచుకుంటున్నారు..