మారుతీ సుజకీపై సెటైర్ వేసిన టాటా మోటార్స్

మారుతీ సుజకీపై సెటైర్ వేసిన టాటా మోటార్స్

Tata Tiago: టాటా మోటార్స్ సోషల్ మీడియా వేదికగా మరోసారి మారుతీ సుజుకీని టార్గెట్ చేసింది. సేఫ్టీ రేటింగ్‌లో వీక్ గా ఉందని సెటైరికల్ గా రెండోసారి చెప్పింది. లేటెస్ట్‌గా చక్రం ఊడిపోయిన ఓ చెక్కబండి ఫొటోను చేసి “OH SH**T! WAGONE,” అనే టెక్స్ట్ పెద్దగా కనిపించేలా పోస్టు చేశారు.

దానికి ‘సేఫ్టీ కూడా ఇంపార్టెంటెంటే. మీరు కొనాలనుకుంటున్న సమయంలో వేరొకరు సలహా ఇస్తున్నప్పుడు స్మార్ట్ గా వ్యవహరించండి’ అంటూ పోస్టు చేసింది. ఈ ఇమేజ్‌ను బట్టి క్లియర్ గా అర్థమవుతోంది అది WagonRను ఉద్దేశించి చేసిన పోస్టేనని. గ్లోబల్ NCAP’s రేటింగ్ లో గతేడాది టెస్టు చేసి ఆ కారుకు 2స్టార్ రేటింగ్ ఇచ్చారు.




https://10tv.in/irctc-halts-tejas-express-as-passenger-occupancy-drops-drastically/
దాంతో పాటు టాటా మోటార్స్ తమ టాటా టియాగోకు 4స్టార్ల రేటింగ్ వచ్చిందని చెప్పింది. దీన్ని టాటా ఈ సెగ్మెంట్ లో సేఫెస్ట్ కార్ అంటూ చెప్పుకొచ్చింది.

ఈ నెలారంభంలో గ్లోబల్ NCAP తాను నిర్వహించిన క్రాష్ టెస్టుల ఫలితాలను విడుదల చేసింది. Maruti Suzuki S-Presso, Hyundai Grand i10 Nios, Kia Seltosలపై టెస్టులు చేసింది. సెల్టోస్ కు 3స్టార్ రేటింగ్ రాగా, గ్రాండ్ ఐ10కు 2స్టార్ రేటింగ్, ఎస్ ప్రెస్సో నిరుత్సాహపరుస్తూ సున్నా రేటింగ్ తీసుకుంది.

వీటి ఆధారంగా టాటా మోటార్స్ కాస్త క్రియేటివిటీ వాడి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ముందు మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో, హ్యూండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ల గురించి పోస్టు చేసి టాటా టియాగో సేఫర్ కార్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

గ్లోబల్ NCAP క్లాష్ టెస్ట్ ఆధారంగా టాటా టియాగో అడల్ట్ ప్రొటెక్షన్‍లో 17 పాయింట్లకు గానూ 12.72పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్‍లో 49కి గానూ 34.15పాయింట్లు దక్కించుకోగా WagonRకు మాత్రం అడల్ట్ ఆక్యుపెంట్‌లో 17కు 6.93, చైల్డ్ ప్రొటెక్షన్‍లో 49కి 16.33పాయింట్లు మాత్రమే వచ్చాయి.