Tata Nano Electric Car: అద్భుత ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?

టాటా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. NEXON EV, TIGOR EV లా ఇప్పుడు ఈ కారు కూడా త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. టాటా వచ్చే ఐదేళ్లలో పది ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.

Tata Nano Electric Car: అద్భుత ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?

TaTa Nano EV Car

Tata Nano Electric Car: దేశంలో ఆటో మొబైల్ రంగంలో ఒకప్పుడు టాటా నానో కారు ఓ సంచలనం అనే చెప్పొచ్చు. 2008 సంవత్సరంలో కేవలం రూ. లక్ష ధరతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన నానో.. కార్లలోనే తక్కువ ధర కలిగిన కారుగా పేరుగడించింది. మధ్య తరగతి ప్రజలను నానో కారు ఎక్కువగా ఆకర్షించినప్పటికీ ఆశించిన స్థాయిలో డిమాండ్ కనిపించలేదు. 2020 సంవత్సరంలో సేఫ్టీ రెగ్యులేషన్స్ కారణంగా నానో కార్లను నిలిపివేశారు. అయితే, రతన్ టాటా కలల కారుకు తాజాగా ఆయన కంపెనీ కొత్త రూపాన్ని ఇచ్చింది. టాటా నానో లుక్ కలిగిన టాటా నానో ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి విడుదల చేయనుంది.

Tata Nano: హెలికాప్టర్‌గా మారిన నానో కారు.. పెళ్లి ఊరేగింపుల కోసం స్పెషల్

బెంగళూరుకు చెందిన మొబిలిటీ సర్వీస్ సైనిక్ పాండ్ సిటీ అండ్ గో ఆల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సర్వీస్ మదర్ పాడ్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని తయారు చేస్తోంది. మెరుగైన సస్పెన్షన్ సెటప్, టైర్లుతో కంపెనీ ఈ కారును వినియోగదారుల కోసం మరోసారి మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. టాటా నానో ఈవీ72వి లిథియం – ఆయిల్ బ్యాటరీతో శక్తినివ్వగలదు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 167 కి.మీ వరకు ప్రయాణించడానికి వీలుంటుంది. 60 సెకన్లలో 60 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇవి మేడిన్ ఇండియా టాప్ 10 బైక్‌లు, కార్లు: మీరెన్ని వాడుతున్నారు?

టాటా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. NEXON EV, TIGOR EV లా ఇప్పుడు ఈ కారు కూడా త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. టాటా వచ్చే ఐదేళ్లలో పది ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఆల్టో కంటే తక్కువ ధరలో లభిస్తుంది.  కేవలం రూ. 2.69 లక్షలు. ఈ కారును రతన్ టాటాకు చూపించినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని, స్వయంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని నడిపారని సోషల్ మీడియాలో ఫొటోలను అప్ లోడ్ చేశారు.