Tauktae Cyclone: అదృష్టవంతురాలు – రెప్పపాటు సమయంలో ప్రాణాలతో బయటపడింది

తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్ లలో భారీ వర్షాలు కురిశాయి. ముంబై మహానగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్లు కోతకు గురి కాగా, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి.

Tauktae Cyclone: అదృష్టవంతురాలు – రెప్పపాటు సమయంలో ప్రాణాలతో బయటపడింది

Cyclone

Tauktae Cyclone: తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్ లలో భారీ వర్షాలు కురిశాయి. ముంబై మహానగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్లు కోతకు గురి కాగా, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. చెట్లు రోడ్లకు అడ్డంగా కూలిపడ్డాయి. ఇదిలా ఉంటే ముంబైలో ఓ మహిళ రెప్పపాటు సమయంలో ప్రాణాలతో బయటపడింది.

రోడ్డు దాటుతుండగా చెట్టు కూలింది. చెట్టు కూలుతున్న సమయంలో మహిళ రోడ్డు దాటుతుంది. ముందు కొమ్మలు రోడ్డును తాకగానే దానిని గురించిన మహిళ ఒక్కసారిగా పరుగు తీసింది. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తౌటే తుఫాన్ దాటికి కర్ణాటకలో 8 మంది మృతి చెందారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాను గుజరాత్ ను అల్లకల్లోలం చేసింది. తౌటే తుఫాన్‌ సృష్టించిన బీభ‌త్సంవ‌ల్ల గ‌త రాత్రి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా దాదాపు 40 వేల వృక్షాలు నేల కూలాయ‌ని గుజరాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ తెలిపారు. అదేవిధంగా సుమారుగా 16,500 గుడిసెలు కొట్టుకుపోయాయ‌ని చెప్పారు.

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు కొన్ని ఎన్జీఓలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.