TCS : ఉద్యోగుల జీతాల పెంపు..ఆరు నెలల్లో రెండోసారి

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.

TCS : ఉద్యోగుల జీతాల పెంపు..ఆరు నెలల్లో రెండోసారి

salary hike

salary hike : సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో ఆ కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తోంది. వారి వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. కరోనా కారణంగా..కొన్ని సంస్థలు ఉద్యోగులను తీసివేస్తూ..జీతాలు పెంచకుండా..నిర్ణయాలు తీసుకొంటుంటే..ఈ కంపెనీ మాత్రం జీతాలు పెంచుతూ..వారికి తీపి కబురు అందిస్తోంది. ఆ కంపెనీ ఏదో కాదు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).
ఉద్యోగులకు జీతాలు పెంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.

ఏప్రిల్ నుంచే పెంపు అమల్లోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు చేయనున్న తొలి కంపెనీ ఇదే. దీంతో సంస్థలోని 4.7 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఆరు నెలల కాలంలోనే టీసీఎస్ చేస్తున్న రెండో వేతన పెంపు ఇది. ఆరు నెలల వ్యవధిలోనే 12-14 శాతం మేర సగటు ఇంక్రిమెంట్ ఉద్యోగులకు లభించినట్లు అవుతుందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ లో ఉద్యోగులకు కంపెనీ వేతన పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని ప్రాంతాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చే పనిలో ఉన్నట్లు టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు.