Kedar Jadhav Father: క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

టీమిండియా క్రికెటర్ కేదార్  జాదవ్  (Cricketer Kedar Jadhav) తండ్రి అదృశ్యమయ్యాడు. ఆయన పేరు మహదేవ్ జాదవ్ (Mahadev Jadhav). 75ఏళ్లు వయస్సు. పూణే  (Pune) నగరంలోని కోత్రుడ్ ప్రాంతంలో నివాసముంటున్నారు.

Kedar Jadhav Father: టీమిండియా క్రికెటర్ కేదార్  జాదవ్  (Cricketer Kedar Jadhav) తండ్రి అదృశ్యమయ్యాడు. ఆయన పేరు మహదేవ్ జాదవ్ (Mahadev Jadhav). 75ఏళ్లు వయస్సు. పూణే  (Pune) నగరంలోని కోత్రోడ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. మహదేవ్ జాదవ్ మార్చి 27న కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీశారు. అయినా ఆచూకీ దొరకక పోవడంతో కేదార్ జాదవ్ కోత్రుడు (Kothrud Police Station) పోలీస్ స్టేషేన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు (Missing case) గా నమోదు చేసుకొని వెతుకులాట ప్రారంభించాడు.

 

మహాదేవ్ జాదవ్‌కు మతిమరుపు ఉన్నట్లు తెలిసింది. అతను బయటకు వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లినా.. అది స్విచ్చాఫ్ కావడంతో అతను ఎక్కడ ఉన్నాడో గుర్తించడం కష్టంగా మారింది. తండ్రి కనిపించక పోవటంతో కొద్ది గంటల్లోనే మహాదేవ్ జాదవ్ ఫొటోను, అతని గురించి తన ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో కేదార్ జాదవ్ పోస్టు చేశారు. అతను మరాఠీ మాట్లాడతాడని, ముఖం ఎడమ వైపున శస్త్రచికిత్స గుర్తు ఉంటుందని, కుడి చేతి వేళ్లలో రెండు బంగారు ఉంగరాలు ధరించాడని జాదవ్ తెలిపాడు.

 

మరోవైపు పోలీసులు మహాదేవ్ జాదవ్ కోసం పరిసర ప్రాంతాల్లో ఆరా తీశారు. కొన్ని గంటల తరువాత మహాదేవ్ జాదవ్ ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలాఉంటే కేదార్ జాదవ్ 2014లో శ్రీలంకపై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. కేదార్ జాదవ్ 73 వన్డేలు ఆడి 42.09 సగటుతో 1,389 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఆరు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. కేదార్ జాదవ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. వన్డే కెరీర్ లో 27 వికెట్లు పడగొట్టాడు. 2015లో టీ20 ఫార్మాట్ లో అరంగ్రేటం చేశాడు. 2022 ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడాడు.

ట్రెండింగ్ వార్తలు