Rishabh Pant Injured : రిషబ్ పంత్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ.. ఆస్పత్రిలో కోలుకుంటున్న క్రికెటర్

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.

Rishabh Pant Injured : రిషబ్ పంత్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ.. ఆస్పత్రిలో కోలుకుంటున్న క్రికెటర్

Rishabh Pant

Rishabh Pant Injured : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. నుదురుకు తగిలిన తీవ్ర గాయానికి వైద్యులు సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది.

పంత్ బ్రెయిన్, వెన్నెముకకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. ఇవాళ రిషబ్ కు మరోసారి వైద్య పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎమ్ ఆర్ఐ సహా పలు కీలక పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న డివైడర్ ను ఢీకొట్టి కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కు నుదురు, మోకాలు వీపు, కుడి మణికట్టు, బొటన వేలికి గాయాలు అయ్యాయి.

Rishabh Pant Road Accident : రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడటంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నిన్న ఉదయం ట్వీట్ చేసిన ప్రధాని..రాత్రి రిషబ్ కుంటుబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. రిషబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అటు బీసీసీఐ కూడా రిషబ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ మానిటర్ చేస్తోంది. బీసీసీఐ కార్యదర్శి జైశాపాల్.. పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మూడేళ్ల క్రితం రిషబ్ పంత్, శిఖర్ ధావన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ సీనియర్ గా నువ్వు నాకు ఏదైనా సలహా ఇవ్వవా అని రిషబ్ పంత్ అడగ్గా.. ఇందుకు గబ్బర్.. ముందు బండి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండూ అంటూ సమాధానం ఇచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. అప్పుడు ధావన్ జోక్ గా పంత్ కు సలహా ఇచ్చినప్పటికీ ఇప్పుడు పంత్ కు యాక్సిడెంట్ కావడంతో వీడియో మారోసారి వైరల్ అవుతోంది.