Youngest Organ Donor: తండ్రి కోసం పదిహేడేళ్ల కూతురు త్యాగం.. అతి చిన్న వయసులో లివర్ దానం.. అరుదైన రికార్డు

తాజాగా కేరళలో ఒక టీనేజీ అమ్మాయి పదిహేడేళ్ల వయసులోనే లివర్ దానం చేసింది. పన్నెండో తరగతి చదువుతున్న దేవానంద అనే అమ్మాయి, తన తండ్రి కోసం ఈ త్యాగం చేసింది. నిబంధనలు దీనికి అంగీకరించకపోయినప్పటికీ, కోర్టు ప్రత్యేక అనుమతితో ఆమె తన తండ్రికి లివర్ ఇచ్చింది.

Youngest Organ Donor: తండ్రి కోసం పదిహేడేళ్ల కూతురు త్యాగం.. అతి చిన్న వయసులో లివర్ దానం.. అరుదైన రికార్డు

Youngest Organ Donor: ఎవరికైనా లివర్, కిడ్నీలు వంటి అవయవాలు పాడై, అవయవమార్పిడి అవసరమైతే ముందుగా రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు మాత్రమే దానం చేయాల్సి ఉంటుంది. అది కూడా మేజర్లు.. అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్లు మాత్రమే దానం చేయాలి.

YS Sharmila SC, ST Case : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

అయితే, తాజాగా కేరళలో ఒక టీనేజీ అమ్మాయి పదిహేడేళ్ల వయసులోనే లివర్ దానం చేసింది. పన్నెండో తరగతి చదువుతున్న దేవానంద అనే అమ్మాయి, తన తండ్రి కోసం ఈ త్యాగం చేసింది. నిబంధనలు దీనికి అంగీకరించకపోయినప్పటికీ, కోర్టు ప్రత్యేక అనుమతితో ఆమె తన తండ్రికి లివర్ ఇచ్చింది. అతి చిన్న వయసులో అవయవదానం చేసిన దాతగా గుర్తింపు పొందింది. కేరళలోని త్రిశూర్‌కు చెందిన ప్రతీష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడికి లివర్ మార్పిడి అవసరమైంది. తనకు తగ్గ లివర్ దాత కోసం వెతికినా సరైన అర్హతలు కలిగిన దాతలు దొరకలేదు.

Delhi-Meerut Expressway: పొగ మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

చివరకు ప్రతీష్ కూతురు దేవానంద లివర్ దానం చేసేందుకు ముందుకొచ్చింది. దేవానంద ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆమె వయసు పదిహేడేళ్లే. నిబంధనల ప్రకారం.. 18 సంవత్సరాలు దాటిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు మాత్రమే దానం చేయాలి. దీంతో పదిహేడేళ్లే ఉండటంతో ఆమె అవయవదానంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో దేవానంద కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అన్ని అంశాలు పరిశీలించిన కోర్టు వైద్యుల సూచనతో ఆమె అవయవదానానికి అంగీకరించింది.

అవయవదానం చేసే ముందు ఆమె జిమ్‌కెళ్లి వ్యాయామం చేసింది. ప్రత్యేక డైట్ తీసుకుంది. నిపుణుల పర్యవేక్షణలో అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ నెల 9న దేవానంద తన లివర్‌లోని కొంత భాగాన్ని తండ్రికి ఇచ్చింది. వైద్యులు ప్రతీష్‌కు లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వారం తర్వాత దేవానంద కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. దేవానంద ప్రస్తుతం అత్యంత చిన్న వయసులో అవయవదానం చేసిన దాతగా గుర్తింపు దక్కించుకుంది.