Assam Child Marriages : బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాదకరంగా ఉంది.. బాల్య వివాహాలపై కఠిన చర్యలు కొనసాగుతాయి : అసోం సీఎం

బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాదకరంగా ఉందని అస్సోం సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. బాల్య వివాహాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.

Assam Child Marriages : బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాదకరంగా ఉంది.. బాల్య వివాహాలపై కఠిన చర్యలు కొనసాగుతాయి : అసోం సీఎం

Assam Child Marriages

Assam child marriages : అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసినా..చేసుకున్నా అరెస్టులు తప్పవని హెచ్చరించటమేకాదు వేలాదిమందిని అరెస్ట్ చేసింది.బాల్య వివాహం చేసుకున్నవారిని చేసినవారి 2278 మందిని అరెస్ట్ చేసిన అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్య వివాహాలు చేసుకున్నవారిని అరెస్ట్ చేయాలని సీఎం బిశ్వశర్మ ఆదేశాల మేరకు ఈ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. దీంతో అస్సోం మహిళలు తమ భర్తలను అరెస్ట్ చేస్తే మేమెలా జీవించాలి? అంటూ భార్యలు (బాలికల) రోడ్డెక్కారు. తల్లులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కానీ మార్పు రావాలంటే ఇటువంటివి తప్పదంటున్నారు సీఎం బిశ్వ శర్మ. చిన్నవయస్సులోనే బాలికలు గర్భం దాల్చితే వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని..బాల్య వివాహాలను వ్యతిరేకించటానికి రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. ఈక్రమంలో అస్సోం రాష్ట్ర వ్యాప్తంగా బాలికల గర్భధారణ రేటు గురించి సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బాలిక గర్భధారణ రేటు ప్రమాద ఘంటికలను మోగించే విధంగా ఉందంటూ ట్విట్టర్ లో దీనికి సబంధించి ఓ నివేదికను షేర్ చేశారు. అదే సమయంలో బాలికల వివాహాలకు వ్యతిరేకంగా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Assom Govt Aginst Child Marriage : బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం : సీఎం వార్నింగ్

సీఎం శర్మ షేర్ చేసిన డేలా ప్రకారం..అసోంలో బాలికల గర్భధారణ రేటు 2022లో 16.8 శాతంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద 6,20,867 మంది బాలికలు 2022లో గర్భం దాల్చారు. 1,04,264 మంది బాలికలు తల్లులయ్యారు. ధుబ్రి, దక్షిణ సల్మారా జిల్లాలో 51.831 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజారోగ్యం, సంక్షేమం కోసమేనని స్పష్టంచేశారు సీఎం, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అసోంలో టీనేజీల ప్రెగ్నెన్సీ రేషియో ప్రమాదకర స్థాయిలో 16.8 శాతంగా ఉంది’’ అంటూ సీఎం ట్వీట్ లో పేర్కొన్నారు. బాలికల వివాహాలకు వ్యతిరేకంగా చర్యలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతాయని సుస్పష్టంచేశారు.