గేమ్‌లో భాగంగా బాలిక దుస్తులు విప్పించాడు, ఆ తర్వాత బ్లాక్ మెయిల్‌కి దిగిన 13ఏళ్ల బాలుడు

గేమ్‌లో భాగంగా బాలిక దుస్తులు విప్పించాడు, ఆ తర్వాత బ్లాక్ మెయిల్‌కి దిగిన 13ఏళ్ల బాలుడు

Teens Instagram blackmailer: చక్కగా స్కూల్ కెళ్లి పుస్తకాలు చదువుకుంటూ స్నేహితులతో ఆడుకోవాల్సిన పిల్లలు దారి తప్పుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని.. పాడు పనులు చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలతో నేరాలకు, ఘోరాలకు, అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ 13ఏళ్ల బాలుడు చేసిన పని పోలీసులనే కాదు అతడి తల్లిదండ్రులను సైతం విస్మయానికి గురి చేసింది.

గేమ్ లో భాగంగా ఓ బాలిక దుస్తులు విప్పించిన ఆ బాలుడు, దాన్ని రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. చివరికి పాపం పండి కటకటాల పాలయ్యాడు.

ముంబైలోని వెస్ట్రన్ సబ్రబ్ ప్రాంతంలో నివాసం ఉండే బాలికకు(14) ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా సోషల్ మీడియాలో గడిపింది. ఆ సమయంలో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ బాలిక ఆ రిక్వెస్ట్ ను వెంటనే యాక్సెప్ట్ చేసింది. అది మొదలు.. ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ”ట్రూత్ ఆర్ డేర్(Truth or Dare)” గేమ్ ఆడటం మొదలుపెట్టారు.

ఒకరోజు గేమ్ లో భాగంగా డేర్ చేయాలని ఆ బాలికకు ఆ బాలుడు మెసేజ్ పెట్టాడు. దుస్తులు విప్పాలని ఆదేశించాడు. దీంతో గేమ్ పరంగా బాలిక తన దుస్తులు విప్పేసింది. ఇదంతా లైవ్ లోనే జరుగుతోంది. ఆ బాలుడు బాలికకు తెలియకుండా తన ఫోన్ లో దాన్ని రికార్డ్ చేశాడు. మళ్లీ బట్టలు విప్పాలని విద్యార్థినికి గేమ్ చాలెంజ్ చేశాడు. అందుకు బాలిక నిరాకరించింది. నేను చెప్పినట్టు దుస్తులు విప్పకపోతే నీ వీడియోలు వైరల్ చేస్తానని బాలుడు బెదిరించాడు. మొదటి సారి దుస్తులు విప్పిన వీడియోని ఆమెకి పంపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

దీంతో విసుగెత్తిపోయిన బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వాడిని గుర్తించారు. పోలీసులు షాక్ తిన్నాడు. అతడు 13 ఏళ్ల బాలుడు అని తెలిసి విస్తుపోయారు. అంతేకాదు ఆ బాలుడు… విద్యార్థిని ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడు, పైగా క్లాస్ మెట్ అని తెలిసి మరింత కంగుతిన్నారు. బాలుడి తల్లిదండ్రులు సైతం షాక్ లో ఉన్నారు. వాళ్లు ఉన్నత విద్యావంతులు. మంచి జాబ్స్ లో ఉన్నారు. తమ కొడుకు ఇలాంటి పాడు పని చేశాడని తెలిసి షాక్ కి గురయ్యారు. లాక్ డౌన్ సమయంలో నిత్యం రూమ్ లో ఫోన్ తో కాలం గడిపేవాడని చెప్పారు. తమ కొడుకు ఏం చేస్తున్నాడో పట్టించుకోకపోవడం తమ పొరపాటే అన్నారు.

ఈ క్రైమ్ తర్వాత పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం కాదు, వారు ఆ ఫోన్ లో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది తెలుసుకోవాలని, పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. పిల్లలు చెడు దారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని పోలీసులు స్పష్టం చేశారు.