ప్రయాణికులకు బంపర్ ఆఫర్ : రైలు ఆలస్యమైతే క్యాష్ బ్యాక్

రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 03:37 PM IST
ప్రయాణికులకు బంపర్ ఆఫర్ : రైలు ఆలస్యమైతే క్యాష్ బ్యాక్

రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు

రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయించింది. రెండు తేజస్‌ రైళ్లను ప్రైవేటుగా నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. కొన్ని రోజుల్లో అంటే అక్టోబర్ నుంచి దేశంలోనే తొలి ‘ప్రైవేటు’ రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ రైల్లో పలు ఆఫర్లు ప్రకటిస్తారని సమాచారం.

ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ నడిపిస్తారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ప్రైవేట్ రైల్లో పలు ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించబోతున్నాయి. ఇండియన్ రైల్వేస్ నడిపించే రైళ్ల విషయంలో ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేసేది సమయపాలన గురించే. రైళ్లు టైమ్‌కు రావన్న ఫిర్యాదులు ఎక్కువ. ఇందుకు భిన్నంగా ప్రైవేట్ రైళ్లు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది రైల్వే శాఖ. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్‌లో కొంత డబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని భావిస్తోంది.

అంతేకాదు రెండు సార్లు ఆహారం.. ఉచితంగా టీ, కాఫీలు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకోసం టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సమయంలో కొన్ని స్నాక్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఎయిర్‌లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతున్నారు. ప్రతీ కోచ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి. దీంతో పాటు సీనియర్‌ సిటిజన్లకు టికెట్‌పై 40శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తారట. ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఢిల్లీ-లక్నో మధ్య తొలి ప్రైవేటు రైలు నడవనున్నట్లు సమాచారం. టికెట్‌ ధర ఈ మార్గంలో నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ టికెట్‌ ధరకు దగ్గరగా ఉండేలా చూస్తున్నారు. 

తేజస్‌ ప్రైవేటు టికెట్‌ కొనేవారికి రూ. 50లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా వర్తించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రైల్లో ఉన్న సమయంలో వారింట్లో దొంగలు పడితే ఆ నష్టపరిహారం కూడా వస్తుందట. టికెట్‌ ధర కూడా సీజన్‌ బట్టి ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. పండగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటే ధర పెంచడం, డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు టికెట్లపై డిస్కౌంట్లు ప్రకటించడం లాంటివి చేయాలని ఆలోచిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి ఢిల్లీ-లక్నో మధ్య తొలి ప్రైవేటు రైలును నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. నవంబర్ చివరినాటికి ముంబై-అహ్మదాబాద్‌ మధ్య రెండో ప్రైవేటు రైలును పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఆ రైల్లోనూ ఇవే ఆఫర్లు తీసుకురానున్నట్లు సమాచారం. తొలి రైలుకి లభించే ఆదరణ ఆధారంగా మిగతా రైళ్లను ప్రైవేటుకు అప్పగించాలా వద్ద అన్న నిర్ణయం తీసుకోనుంది రైల్వేశాఖ. తేజస్ రైళ్లు అందులోని ఆఫర్ల గురించి వింటుంటే.. ప్రయాణికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆఫర్లు చాలా టెంప్ టింగ్ గా ఉన్నాయని అంటున్నారు. ఎప్పుడెప్పుడు తేజస్ రైళ్లు అందుబాటులోకి వస్తాయా అందులో జర్నీ చేస్తామా అని ఎదురు చూస్తున్నారు.