Election 2022 : లక్ష్మణ్‌‌కు కీలక బాధ్యతలు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం

జేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఉత్తరాఖండ్ 70, యూపీ 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే

Election 2022 : లక్ష్మణ్‌‌కు కీలక బాధ్యతలు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం

Bjp

Telangana BJP Leader Dr.k.Laxman : బీజేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఉత్తరాఖండ్ 70, యూపీ 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే భాద్యతలను ఆయనకు అప్పగించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకుల పవనాలు ఉన్నాయని, తమ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు, యూపీలో మోదీ – యోగీ, ఉత్తరాఖండ్ లో మోదీ – పుష్కర్ సింగ్ దామి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. అనేక మంది పాలన నచ్చి బీఎస్పీ, ఎస్పీ నేతలు బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Read More :  YS Sharmila: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడను.. ముందస్తు ఎన్నికలొస్తే మాకే మంచిది -వైఎస్ షర్మిల

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, పంజాబ్ లో మెరుగైన స్థానాలు గెలుచుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఐదు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రాజకీయాల కోసం బరిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నట్లు, రైతుల మేలు కోసం యోగీ సర్కార్ 36 వేల కోట్లు, 86 లక్షల మందికి రుణమాఫీ చేశారని గణాకాంలతో సహా చెప్పారు. యూపీ రైతులకి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందుతుందని తెలిపిన ఆయన 43 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించారన్నారు. 4.5 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని, 2 కోట్ల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయన్నారు. అంతేగాకుండా విద్యార్థులకు ట్యాబ్ లు, విద్యార్థినులకు ఉచిత విద్య అందిస్తోందన్నారు. 75 మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. 25 కోట్లమందికి ఉచిత వ్యాక్సిన్ అందేసినట్లు, ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందుతోందన్నారు.

Read More : Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

మూతబడిన 20 చక్కెర కర్మాగారాలు తెరిచి ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ పార్టీకి దక్కుతుందన్నారు. రామ మందిర నిర్మాణం, భవ్యకాశి దివ్యకాశి, భవిష్యత్ లో మధుర అభివృద్ధి బీజేపీతో సాధ్యం కాబోతోందని స్పష్టం చేశారు. ఓబీసీలు, బీసీలకు కేంద్ర కేబినెట్ లో మోదీ ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు లక్ష్మణ్. కాంగ్రెస్ నామ మాత్రపు పార్టీగా తెలంగాణలో మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ నిలుస్తుందన్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలిగాయని, అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిపారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్.