K Chandrashekar Rao : బీహార్‌కు తెలంగాణ సీఎం.. కేసీఆర్ టూర్‌పై రాజకీయవర్గాల్లో ఆసక్తి

తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లనున్నారు. కేసీఆర్ బీహార్ టూర్ కి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13(శని), 14 తేదీల్లో (ఆదివారం) కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారు.

K Chandrashekar Rao : బీహార్‌కు తెలంగాణ సీఎం.. కేసీఆర్ టూర్‌పై రాజకీయవర్గాల్లో ఆసక్తి

K Chandrashekar Rao : తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లనున్నారు. కేసీఆర్ బీహార్ టూర్ కి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13(శని), 14 తేదీల్లో (ఆదివారం) కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారు.

ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేయడంతో నితీశ్ కుమార్ తో సీఎం కేసీఆర్ మర్యాపూర్వకంగా భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ బీహార్ టూర్ పై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Bihar Politics : కమలానికి దూరమవుతున్న మిత్రపక్షాలు..బీజేపీకి నితీష్ బ్రేకప్‌ స్టోరీస్‌ వెనక భారీ వ్యూహం ఉందా..?

రెండు రోజుల పాటు కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. శనివారం, ఆదివారం బీహార్ లో ఉంటారు. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లను కేసీఆర్ కలిసి అభినందించనున్నారు. అనంతరం వారితో భేటీ కానున్నారు. తేజస్వి యాదవ్ గతం నుంచి కూడా కేసీఆర్ తో టచ్ లోనే ఉన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న సమయం నుంచే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం, భేటీ కావడం జరిగింది.

Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

తాజాగా జేడీయూ ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆర్జేడీతో కలిసిన జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తి రేపింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్న సమయంలో మరో పార్టీ కూడా సీఎం కేసీఆర్ కు అండగా నిలిచే అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. నితీశ్ కుమార్ కూడా కేసీఆర్ తో కలిసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించి బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ తీరుని తప్పు పడుతూ ఎన్డీయే కూటమి నుంచి నితీశ్ బయటకు రావడంతోనే.. నితీశ్ ను కలవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw