దేశంలోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలున్న రాష్ట్రంగా తెలంగాణ

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 08:04 PM IST
దేశంలోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలున్న రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్‌లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను ఏర్పాటుచేసిన దేశంలోని మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ (DOPO) వెల్లడించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్ట్ రీసెంట్ గా ఈ డేటాను విడుదల చేసింది.

ఈ డేటా ప్రకారం…దేశంలోనే అత్యధికంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నెం.1స్థానంలో నలిచింది. జనవరి2019 నాటికి తెలంగాణ పోలీసులు 2లక్షల 75వేల 528 సీసీటీవీ కెమెరాలను ఇన్ స్టాల్ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 4లక్షల 27వేల 529 సీసీటీవీ కెమెరాలు ఉంటే అందులో 2లక్షల 75వేల 528 ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 64శాతం తెలంగాణలో ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కేవలం 5,332సీసీటీవీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణతో పోల్చినప్పుడు…తమిళనాడు విస్తీర్ణం మరియు జనాభా పరంగా పెద్ద రాష్ట్రం అయినప్పటికీ, 40,112 సీసీటీవీ కెమెరాలతో రెండవ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 39,587 కెమెరాలు, మధ్యప్రదేశ్‌లో 21,206, ఆంధ్రప్రదేశ్‌లో 14,770 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.

సీసీటీవీ కెమెరాలు రాష్ట్రంలోని పోలీసులకు నేరాలను నివారించడానికి మాత్రమే ఉపయోగపడలేదు. అనేక సంచలనాత్మక కేసులలో నిందితులను పట్టుకోవడంలో అవి ప్రత్యేకంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. గతేడాది నవంబర్ లో శంషాబాద్ దగ్గర్లో దిశ ఘటన సమయంలో,అంతకుముందు వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారి రేప్, హత్య వంటి అనేక కేసుల్లో సీసీటీవీ కెమెరాలు పోలీసులకు నిందిుతులను పట్టుకోవడంలో చాలా హెల్ప్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఇతర అంశాల పరంగా తెలంగాణ పోలీసులు చాలా రాష్ట్రాల వెనుక ఉన్నారు. మొయినాబాద్‌లో స్నిఫర్ మరియు ట్రాకర్ డాగ్స్ కు శిక్షణ ఇవ్వడానికి అత్యాధునిక ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటిఏ) ఉన్నప్పటికీ, తెలంగాణలో కేవలం 56 స్నిగ్గర్ డాగ్స్,152 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటిఏ డాగ్స్ ను ట్రైయిన్ చేస్తుంది. జిఎంఆర్ విమానాశ్రయం మరియు ఇతర ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన కుక్కలకు కూడా శిక్షణ ఇస్తుంది.