Public Smoking: పొగ రాయుళ్లకు షాక్ ఇస్తున్న అధికారులు.. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా

పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. భారీ సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా విధించారు.

Public Smoking: పొగ రాయుళ్లకు షాక్ ఇస్తున్న అధికారులు.. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా

Public Smoking: పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగడంపై దేశవ్యాప్తంగా నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అలా తాగితే జరిమానాతోపాటు, కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ చట్టం అమలవుతోంది. దీనిలో భాగంగా లక్షలాది మందికి జరిమానా విధిస్తున్నారు.

Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో

అనేక రాష్ట్రాల్లో 2021-2022కు సంబంధించి విధించిన జరిమానాల వివరాల్ని తాజాగా కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో అత్యధికంగా 1.46 లక్షల మందికి జరిమానా విధించారు. ఆ తర్వాత వరుసగా హిమాచల్ ప్రదేశ్‌లో 75,572 మందికి, కేరళలో 73,464 మందికి, మహారాష్ట్రలో 28,298 మందికి జరిమానా విధించగా తెలంగాణలో 28,000 మందికిపైగా జరిమానా విధించారు. పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగిన వారికి జరిమానా విధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. 2019-2020లో విధించిన జరిమానా కంటే 2021-2022లో విధించిన జరిమానా 15,216 మందికి ఎక్కువ కావడం విశేషం.

Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం.. నిజంగానే చంపిన స్నేహితులు!

పొగ తాగడాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేస్తోంది. ప్రభుత్వ చర్యల వల్ల గతంతో పోలిస్తే స్మోకింగ్ చేసే వాళ్ల సంఖ్య తగ్గుతోంది. అయితే, గతంతో పోలిస్తే రెండు మూడేళ్లు ముందుగానే యువత స్మోకింగ్ అలవాటు చేసుకుంటోంది. పిల్లలు చాలా చిన్న వయసులోనే స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్నారు. ఇది క్రమంగా డ్రగ్స్ అలవాటుకు దారి తీస్తోంది అని కేంద్ర నివేదిక తెలిపింది.