కంగారొద్దు : అమెరికాలో విద్యార్థుల రిలీజ్ ఎప్పుడు ? 

  • Published By: madhu ,Published On : February 3, 2019 / 04:07 AM IST
కంగారొద్దు : అమెరికాలో విద్యార్థుల రిలీజ్ ఎప్పుడు ? 

హైదరాబాద్ : అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ విషయంలో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో జాబ్స్ చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే వీరికి సహాయం చేసేందుకు అక్కడి తెలుగు రాష్ట్రాల సంఘాలు ముందుకొచ్చాయి. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు నిపుణులతో చర్చిస్తున్నారు. 

మరోవైపు నకిలీ యూనివర్సిటీ కేసులో అగ్రరాజ్యమైన అమెరికాలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమెరికాలోని 8 రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు పోలీసుల నిర్భందంలో ఉండడంతో వారి కుటుంసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. న్యూజెర్సీ డిటెన్షన్ సెంటర్‌లో స్టూడెంట్స్‌ని విద్యార్థులను తెలుగు సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. తెలుగు రాష్ట్రాలు ఇందులో జోక్యం చేసుకుంటే సమస్య కొంత తీరే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

కొంతమంది స్టూడెంట్స్‌కి డిటెన్షన్ చేశారని…ఎంటీ ఇవ్వడం జరుగుతుందని..దీనివల్ల విద్యార్థులు బయటకు రావాలంటే సుమారు 30 నుండి 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం. 5వేల డాలర్ల పూచీకత్తు..పౌరసత్వం ఉన్నవారు హామీనిస్తే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి కంగారు పడొద్దని..విద్యార్థులంతా బైటికొస్తారని తెలుగు సంఘాలు భరోసానిస్తున్నాయి.